టూట్ పేస్ట్ వాడే ముందు ఈ నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు
మనం ఉదయం లేవగానే మొదట చేసే పని బ్రష్ చేయటం. మన రోజువారీ దినచర్యలో ఒక భాగం. పళ్ళు ఎంత శుభ్రంగా,ఆరోగ్యంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుందని అర్ధం. ఉదయం బ్రష్ చేయటానికి రకరకాల టూట్ పేస్ట్ లను వాడుతూ ఉంటాం. అసలు మనం ఏ టూట్ పేస్ట్ వాడితే మంచిదో తెలుసుకుందాం. ఎందుకంటే మనం పళ్ళను శుభ్రం చేయటానికి ప్రతి రోజు టూట్ పేస్ట్ ని ఉపయోగించినప్పుడు శరీరంలోకి వెళ్ళుతుంది. కాబట్టి ఎలాంటి టూట్ పేస్ట్ వాడితే మంచిదో ఒక్కసారి చెక్ చేసుకోవటం మంచిది. మన మార్కెట్ లో ఎన్నో రకాల టూట్ పేస్ట్ లు అందుబాటులోఉన్నాయి . ఏ టూట్ పేస్ట్ అయినా దానిలో ఉన్న ఇంగ్రిడియన్స్ బట్టి క్వాలిటీ అనేది ఉంటుంది.
ఇప్పుడు ఏ టూట్ పేస్ట్ వాడితే మంచిదో వివరంగా తెలుసుకుందాం. దంత క్షయం (కావిటీ) సమస్య ఉన్నవారు సోడియం ఫ్లోరైడ్ ఉండే టూత్‌పేస్ట్ ని వాడాలి. దీంతో ఆ కెమికల్ దంత సమస్యలను దూరం చేసి దంతాలను కాపాడుతుంది.. అయితే టూత్‌పేస్ట్‌లను తినే పిల్లలకు మాత్రం ఇలాంటి పేస్ట్‌ను వాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఇలాంటి టూత్ పేస్ట్ లోపలికి వెళ్తే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.వేడి లేదా చల్లని వస్తువులు తీసుకున్నప్పుడు కొంతమందికి దంతాల్లో నొప్పి వస్తుంది. దంతాలు తీపులు వచ్చినట్టు అవుతాయి. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు డీసెన్సిటైజింగ్ (Desensitizing) టూత్ పేస్ట్ వాడాలి. దీంతో వేడి, చల్లని పదార్థాలను
తిన్నా దంతాలకు ఏమీ కాదు.చిగుళ్లలో నొప్పిగా ఉండి, అప్పుడప్పుడు రక్తం కారుతూ ఇతర చిగుళ్ల సమస్యలతో బాధ పడేవారు Anti-gingivitis కలిగిన టూత్ పేస్ట్ ని వాడితే మంచిది. ఈ సమస్యకు ఇలాంటి టూత్‌పేస్టే చక్కని పరిష్కారం చూపుతుంది. కొంతమంది పాచితో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి వారు Tartar-control టైప్ టూత్ పేస్ట్‌ను వాడాలి. ఇలాంటి టూత్ పేస్టులు నోట్లో ఉండే బాక్టీరియాను నిర్మూలించి తాజా శ్వాసను కూడా ఇస్తాయి. ఎటువంటి దంత సమస్యలు లేనివారు టీత్ వైటెనింగ్ టూత్ పేస్ట్ వాడితే సరిపోతుంది. టీత్ వైటెనింగ్ టూత్ పేస్ట్ అంటే దంతాలను తెల్లగా మార్చే టూట్ పేస్ట్. సాధారణంగా చాలా మంది ఇలాంటి టూట్ పేస్ట్ నే వాడుతారు.