Movies

మహర్షి హిట్ కావటానికి ఆరు కారణాలు ఇవే…!

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంగా వచ్చిన మహర్షి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మహేష్ కెరీర్ లో మైలురాయిగా నిలుస్తోంది. రిచ్ నెస్ తో కూడిన ఈ మూవీ అన్ని కోణాల్లో ఆడియన్స్ ని అలరిస్తోందని అంటున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్, పొట్లూరి వి ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. మొదటి భాగం యూత్,క్లాస్ ఆడియన్స్ ని మెప్పిస్తే, రెండవ భాగం మాస్ ఆడియన్స్ ని మురిపించేలా ఉంది. మొత్తం మీద అన్ని వర్గాలను అలరించేలా ఉంది.

మహర్షి మూవీకి ఇంతటి క్రేజ్ రావడంతో పాటు పాజిటివ్ రెస్పాన్స్ రావడం వెనుక కీలక అంశాలను ఓసారి ప్రస్తావించుకుందాం. ఈ సినిమా కథను కేవలం 15నిమిషాల సేపు విన్నాక ఒకే చేసాడు. బలమైన కథ,ఎమోషన్స్ గల ఈ మూవీ అన్ని వర్గాలకు చేరువయ్యేలా ఉంది. కంటెంట్ పరంగా చూస్తే,భరత్ అను నేను మూవీ కంటే, మహర్షి కి మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు. వైవిధ్య నటనను ప్రదర్శించుకునే ఛాన్స్ ఈ మూవీతో మహేష్ కి వచ్చింది. విద్యార్థిగా మాస్ ని అలరించిన మహేష్ , సిఇఓగా స్టైలిష్ గా కనిపిస్తాడు.

రైతు సమస్యలపై పోరాడేటప్పుడు సిన్సియారిటీ కనిపించింది. తెరమీద మరింత అందంగా కనిపిస్తూ ఫాన్స్ ని అలరించే యత్నం చేసాడు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు వినగా వినగా నచ్చుతాయని అంటారు కదా,మహర్షి మూవీ సాంగ్స్ విషయంలో కూడా అదే జరిగింది. ఇక నేపధ్య సంగీతంలోనూ దేవిశ్రీ తన సత్తా చూపెట్టాడు. ప్రతి ప్రే ములోనూ రిచ్ నెస్ వచ్చేలా దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఖర్చుకి వెనకాడకుండా రిచ్ గా తీస్తే ,థియేటర్ లోనే మూవీ చూడాలన్న ఫీలింగ్ సగటు ప్రేక్షకుడికి ఉంటుంది.

సరిగ్గా మహర్షి మూవీ దాన్ని నిజం చేసింది. హీరోయిన్ పూజ హెగ్డే గ్లామర్ తో సరిపెట్టకుండా కథలో ప్రాధాన్యం గల పాత్ర ఆమెది. జగపతి బాబు స్టైలిష్ విలన్ గా తన నటనను మరోసారి చాటుకున్నాడు. అల్లరి నరేష్ ఈ మూవీలో కథకు కీలకంగా మారాడు. వైవిధ్యమైన పాత్రతో అగరగొట్టేసాడు. ఇన్నాళ్లూ కామెడీ సినిమా హీరోగా రాణించిన అల్లరి నరేష్ ఈ మూవీతో, ఇలాంటి పాత్రలకు ఛాన్స్ దక్కించుకుంటాడని చెప్పవచ్చు. జయసుధ, ప్రకాష్ రాజ్ వంటి వాళ్ళు తమతమ పాత్రల్లో ఒదిగిపోయారు.