Movies

మెగా బ్రదర్స్ తో ఫోటో లో ఉన్న టాప్ హీరో ఎవరో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషికి కేరాఫ్ ఎడ్రెస్ చిరంజీవి. కష్టపడి మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి సోదరులు నాగబాబు,పవన్ కళ్యాణ్ కూడా సినిమాల్లో తమ సత్తా చాటారు. ఎవరి రేంజ్ వారిదే. ఇందులో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసాడు. నాగబాబు కూడా ఎంపీగా బరిలో ఉన్నాడు. పోలింగ్ పూర్తయ్యి,మే3న ఫలితాలకోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

గాజువాక,భీమవరం అసెంబ్లీ స్థానాలనుంచి పవన్ పోటీ చేయగా, నరసాపురం ఎంపీ సీటు నుంచి నాగబాబు పోటీచేశారు. ఇక ఈ మెగా బ్రదర్స్ ముగ్గురూ కల్సి ఉన్న ఫొటోలో వాళ్ళ భుజాలెక్కిన ఓ గడుగ్గాయి ఫోటో ఇటీవల వైరల్ అయింది. ఆ గడుగ్గాయి ఎవరో కాదు మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్. తన చిన్ననాటి జ్ఞాపకాలను ఇలా భద్రంగా దాచుకున్నాడు. వాటిని ఫాన్స్ తో పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

నాన్న,బాబాయ్ ల విజయం గురించి చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న వరుణ్ కి చిరంజీవి,పవన్ లంటే చాలా అభిమానం. వరుస సినిమాలతో బిజీగా ఉన్న వరుణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో వాల్మీకి మూవీలో చేస్తున్నాడు. మరోపక్క బాక్సింగ్ నేపథ్యంలో ఓ భారీ మూవీలో చేయడానికి కూడా వరుణ్ సన్నద్ధం అవుతున్నాడు. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందని అంటున్నారు.