సుమతో బ్రేక్ అప్ అయింది…రాజీవ్ చెప్పిన నిజాలు వింటే షాక్
కొందరికి లవ్ స్టోరీ సక్సెస్ అవుతుంది. కొందరికి భగ్నం అవుతుంది. మరికొందరి ప్రేమ మధ్యలో ఆగిపోయినా మళ్ళీ పట్టాలెక్కుతోంది. అయితే యాంకర్ సుమ,నటుడు రాజీవ్ ల ప్రేమ బ్రేక్ అయిందట. టివి ప్రోగ్రామ్స్ ,సినీ ఫంక్షన్స్ లో బిజీ యాంకర్ గా మారిన సుమ,సినిమాల్లో బిజీ నటుడిగా ఉంటున్న రాజీవ్ కనకాల మధ్య మొదట్లో ప్రేమ ఎలా పుట్టిందో తెలుసా? ప్రస్తుతం మహర్షి సినిమా హిట్ అవ్వడంతో ఆ సినిమాలో నటించిన రాజీవ్ ఆ సినిమాలో సంఘటనలను పంచుకుంటూనే సుమతో లవ్ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘ మేఘమాల సీరియల్ ని మా నాన్న దేవదాస్ కనకాల తీశారు. అందులో సుమ హీరోయిన్.
నాది చాలా చిన్నపాత్ర. ఆ సీరియల్ నుంచే సుమతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారి చివరకు పెళ్లిపీటలు ఎక్కింది. నిజానికి ఈ సీరియల్ కి ముందే సుమని చూసా. నేను డైరెక్ట్ చేసిన సీరియల్ ఎడిట్ కి వెళ్ళినపుడు అక్కడ సుమని చూసి ఇంప్రెస్ అయ్యాను. మాధురి అనే సింగిల్ ఎపిసోడ్ ఇద్దరం కల్సి చేసాం. ఒకరోజు చేసాక, ఇంకోరోజు ఉంటె బాగుండును కదా. ఇంప్రెస్ చేయడానికి ఒకరోజు ఎలా సరిపోతుంది అనుకున్నా’అని రాజీవ్ కనకాల వివరించాడు. ‘ఇక ఆతరువాత జీవనరాగం సీరియల్ లో ఏడురోజుల పెళ్లి షూట్ చేసాం. అందులో పెళ్లికూతురిగా సుమ చేసింది.
నిజానికి సుమను తొలిసారి చూసినపుడే మనసు పారేసుకున్నా. మొత్తానికి సుమను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ప్రపోస్ చేసాను. నో చెబుతుందని భయపడ్డాను. ‘అమ్మాయిల వెంట పడితే వాళ్ళు పడరు. కొన్నాళ్ళు వెంటపడి అప్పుడు వెళ్ళిపో,ఏమిటి రావడం లేదు అని ఆలోచించి, అప్పుడు ప్రేమలో పడతారు. అయితే నేను ప్రేమిస్తున్న విషయాన్ని సుమ గమనించింది. నో చెప్పాలని ఫిక్స్ అయింది. కానీ ప్రపోస్ చేసి, మెట్లు దిగుతూ,వెనక్కి తిరిగి చూసా. తను నన్ను చూడ్డడంతో హమ్మయ్య అనుకున్నా. మూడురోజులు కనిపించకుండా పోయా.
అయితే మూడు రోజుల్లోనే ఒకే చేసింది. అది కూడా ఫోన్ చేసి ఇష్టమే అని చెప్పింది’ అని రాజీవ్ చెప్పాడు.ఇలా ఇద్దరం ఒకే అనుకున్నాక,మా లవ్ కి ఏడాదిన్నర బ్రేక్ పడిపోయింది. ‘నేను ఎలాంటి ఆంక్షలు పెడతానోనని, ఎలాంటి సమస్యలు వస్తాయోనని లవ్ స్టార్ట్ అయ్యాక సుమ బ్రేక్ అప్ అనేసింది. నేను చాలా కన్వెన్స్ చేసే ప్రయత్నం చేశాను. తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయా. 1998లో మా లవ్ స్టోరీ చిగురించింది. టెలివిజన్ యాక్టర్స్ అసోసియేషన్ ని మా నాన్న ఏర్పాటుచేసి ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు సుమ ఈసీ మెంబర్ గా పోటీ చేసింది. నేను లెక్కింపుకు వెళ్లాను. అలా సుమకు దగ్గరయ్యా. అలా బ్రేక్ అప్ అయిన మా లవ్ స్టోరీ లైన్ లో పడడంతో ఒకనెలలోనే పెళ్లి కూడా అయిపొయింది’అని రాజీవ్ చెప్పాడు.