Movies

రచ్చ రవి జబర్దస్త్ నుండి వెళ్లిపోవటానికి కారణాలు ఇవే?

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్ దస్త్ ప్రోగ్రాం ఎంతోమంది కి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. కంటెస్టెంట్స్ కి ఊపిరిపోసింది. ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చేసింది. కంటెస్టెంట్స్ లో రచ్చ రవి రూటే వేరు . తనదైన శైలిలో ఆడియన్స్ ని నవ్వించే యితడు ఈ మధ్య కనిపించడం లేదు. అయితే కావాలనే ఇతన్ని తప్పించినట్లు ఇటీవల ప్రచారం సాగుతోంది. తాజాగా ఇటీవల సత్తిపండు కి ఇందుకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ‘రచ్చ రవిని ఎవరో తొక్కేశారనడం లో అర్ధం లేదు. అసలు అక్కడ అలాంటి ఆలోచనలు , గొడవలు ఉండవు. 

ఇక రచ్చ రవికి ఆమధ్య వరుస సినీ ఛాన్స్ లు వచ్చాయి. అందుకే సినిమాలపై దృష్టి పెట్టాడు. అంతే కాని మరో కారణం లేదు ‘అని సత్తిపండు చెప్పుకొచ్చాడు. ‘జబర్దస్త్ ప్రోగ్రాం లో నాకు బంధువులు లేరు. నాలో టాలెంట్ ఉండడం వల్లనే నన్ను  ఎంకరేజ్ చేస్తున్నారు. టాలెంట్ ఉంటె జబర్ దస్త్ ప్రోగ్రాం లో ఎవరైనా నిలదొక్కుకోవచ్చు’అని సత్తిపండు చెప్పాడు.