మహర్షి సినిమాలో నటించిన ఈ తాత ఎవరి తండ్రో తెలిస్తే షాక్ అవుతారు
వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతోంది. మహేష్ 25వ చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో రైతు పాత్రలో ఒదిగిపోయిన వ్యక్తి గురించి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘బాబు ఇంకెన్నాళ్లు బతికి ఉంటానో తెలీదు. బతికి ఉన్నంతకాలం నువ్వు గుర్తుంటావ్. నేను నీకు ఏమివ్వగలను. నేను పుట్టినప్పటినుంచి మేము నమ్ముకున్న దొక్కటే. దీన్ని మాత్రం నీకివ్వగలం’అంటూ మహర్షి మూవీలో ఈ డైలాగ్ వింటే ప్రతి ఒక్కరు రైతుల గురించి ఆలోచిస్తారు.
రైతు వేషధారణలో ఇలా మాట్లాడిన వ్యక్తి కర్నూల్ కి చెందిన ఎం గురుస్వామి. ఈయన ప్రముఖ రంగస్థల కళాకారుడు. వెల్దుర్తికి చెందిన బాలమ్మ దంపతుల ఐదుగురు సంతానంలో గురుస్వామి ఒకరు. పెద్ద కుటుంబం కావడంతో అర్దిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇక ఎలాగోలా కష్టపడి గురుస్వామి బి.ఎస్. ఎన్. ఎల్.లో ఉద్యోగం చేసి,2003లో రిటైరయ్యాడు. నిజానికి ఇంటి సమస్యలనుంచి బయటపడడానికి నాటకరంగం ఎంచుకున్న గురుస్వామి1960లో నేటి విద్యార్థి నాటకంలో తొలిసారి నటించారు. 1964లో ఉద్యోగంలో చేరారు. రిటైరయ్యాక నాటకాల్లో వేసి, ఆతర్వాత లఘు చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సినీ రంగ ప్రవేశం చేసారు. మహర్షి లో నటించే ఛాన్స్ రావడం సంతోషాన్ని ఇచ్చిందని గురుస్వామి చెప్పారు.
ఎవనించే జనియించి,అరసు,గణం,పుటుక్కు జరజర డుబుక్కుమే వంటి ఎన్నో సాంఘిక పౌరాణిక నాటకాల్లో నటించి మెప్పించారు. స్వర్గీయ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి వంటి వారితో కల్సి వేమన ,సక్కుబాయి వంటి నాటకాల్లో వేశారు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ఈయనను కర్నూల్ టీజె వి కళాక్షేత్రం రాయలసీమ రత్నం అవార్డుతో సత్కరించింది. అజిత్ దర్శకత్వంలో వచ్చిన ఆయుష్మాన్ భవ మూవీలో తన మిత్రుడు పరమేశ్వర శర్మతో కల్సి నటించిన గురుస్వామి, మహర్షి యూనిట్ ఆఫీస్ కి వెళ్లి ఏదో ఛాన్స్ ఇప్పించాలని కోరారు. కో డైరెక్టర్ రాంబాబు ఆడిషన్స్ కి పిలిచి ఒకే చేసారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి తదితరులు చూసి సెలెక్ట్ చేసారు. వివిధ ప్రదేశాల్లో జరిగిన షూటింగ్స్ లో 25రోజులు పాల్గొన్నారు.