Movies

వంశీ పైడిపల్లి కెరీర్ లో ఎన్ని హిట్స్…ప్లాప్స్ ఉన్నాయో చూడండి

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన మున్నా మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన వంశీ పైడిపల్లి పలు సినిమాలు చేసి,తాజగా మహేష్ హీరోగా మహర్షి చేసి హిట్ కొట్టాడు. ఆదిలాబాద్ జిల్లాలో తండ్రికి థియేటర్ ఉండడంతో సినిమా వాతావరణంలో పెరిగిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో స్కూల్ చదువు పూర్తిచేసాడు. భద్రుకా ఎడ్యుకేషనల్ సొసైటీ సంస్థ నుంచి డిగ్రీ, మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ చదివాడు. 2002లో సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి, ఈశ్వర్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. వర్షం,భద్ర,మాస్ మూవీస్ కి అసోసియేటెడ్ డైరెక్టర్ గా చేసాడు. 

2007లో ప్రభాస్,ఇలియానా జంటగా మున్నా సినిమాతో డైరెక్టర్ గా రంగప్రవేశం చేసాడు వంశీ పైడిపల్లి. దిల్ రాజు నిర్మించిన యాక్షన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మున్నా ఎందుకో విజయాన్ని నమోదుచేసుకోలేదు. దాంతో వంశీకి ఛాన్స్ లు రాలేదు. 2010లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బృందావనం తెరకెక్కించాడు. కాజల్,సమంత హీరోయిన్స్ గా నటించిన ఈమూవీ మంచి హిట్ కొట్టింది. ప్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ అంచనాకు తగ్గట్టుగానే ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. 

బృందావనం విజయంతో రామ్ చరణ్,అల్లు అర్జున్ లతో ఎవడు మూవీ తెరకెక్కించిన వంశీ పైడిపల్లి మొత్తానికి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆతర్వాత నాగార్జున,కార్తీలతో తీసిన ఊపిరి మూవీ కూడా విజయాన్ని నమోదుచేసుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ మహర్షి మూవీ కోసం ఏకంగా మూడేళ్లు శ్రమించాడు. లేటుగా తీయడం,రీ షూట్స్ చేయడం వంటివి చేస్తాడనే  ముద్ర పడింది.