మహర్షి సినిమాలో నటించిన ఈ బుడ్డోడు ఎవరి కొడుకో తెలుసా?
హీరో, హీరోయిన్స్ కి నటులకు ఎంతటి క్రేజ్ ఉంటుందో, చైల్డ్ ఆర్టిస్టులకు కూడా అదే రేంజ్ ఉంటుంది. కొన్ని సినిమాలు చైల్డ్ ఆర్టిస్టులకోసమే ఆడతాయి. ఇక తాజాగా విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి లో మూగ పిల్లాడిలా నటించిన కుర్రాడు యాక్షన్ తో అదరగొట్టాడు. బూరి బుగ్గల ఈ అబ్బాయి పేరు చక్రి అలియాస్ పూజారి రామ్ చరణ్. శ్రద్ధ స్కూల్ లో 3వ తరగతి చదువుతున్న చక్రి ఎనిమిదేళ్ల వయస్సులో అవలీలగా యాక్టింగ్ చేసేస్తున్నాడు. చదువు మీద ఎంతటి శ్రద్ధ వుందో యాక్టింగ్ పైకూడా అంతే శ్రద్ధ వుంది. పూజారి సతీష్ నాయుడు , ధనశ్రీ దంపతుల కుమారుడైన చక్రిని స్కూల్ కి సెలవు పెట్టించి మరీ, డైరెక్టర్స్ షూటింగ్స్ కి తీసుకుపోతున్నారు.చక్రికి వరుస ఛాన్స్ లు వస్తున్న నేపథ్యంలో పేరెంట్స్ కూడా అందుకే మొగ్గు చూపిస్తూ షూటింగ్స్ కి పంపిస్తున్నారు. చిన్న నాటి హీరోలను చూపించాలన్నా,ఏదైనా చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఉన్నా వెంటనే చక్రి గుర్తొస్తాడు.
కాల్ వచ్చిన వెంటనే షూటింగ్స్ కి పంపించడానికి పేరెంట్స్ రెడీగా ఉంటున్నారు. మిర్చి,మహానటి ,మహానుభావుడు, వన్ నేనొక్కడినే,గుంటూరోడు,మనం,రోజులు మారాయి,నాన్నకు ప్రేమతో ఇలా దాదాపు 45సినిమాల్లో నటించి తన సత్తా చాటాడు. సతీష్ నాయుడు ముగ్గురు పిల్లల్లో చక్రి ఒక్కడే నటుడు కాదండోయ్. అన్నయ్య విష్ణు చరణ్,తమ్ముడు కృష్ణ చరణ్ సైతం సినిమాల్లో చేస్తున్నారు. విష్ణు చరణ్ 20సినిమాలు,కృష్ణ చరణ్ 10మూవీస్ చేసాడు. ఇక చక్రి నటించే సినిమాలు కూడా హిట్ కొట్టడంతో మనోడి లెగ్ గోల్డెన్ లెగ్ లా భావించి తమ సినిమాల్లో బుక్ చేస్తున్నారు.
ఒక్కోసారి కథలో చిన్నపిల్లల క్యారెక్టర్స్ కూడా క్రియేట్ చేస్తున్నారట. తాజగా వచ్చిన మహర్షి లో కూడా ఈ బుడ్డోడి పాత్ర కూడా క్రియేట్ చేసిన చందంగానే ఉంది. యితడు చదివే స్కూల్ యాజమాన్యం కూడా ఇతడికి తగిన వసతి కల్పిస్తోంది. ఈ వయస్సులో దేశవిదేశాల్లో తిరిగి నటిస్తుండడం తమ స్కూల్ కి గర్వకారణమని యజమానులు అంటున్నారు. నాన్నకు ప్రేమతో మూవీ కోసం 25రోజులు లండన్ లో ఉండివచ్చాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో మెంబర్ షిప్ గల ఏకైక బాలనటుడు కూడా చక్రి కావడం విశేషం. కొడుక్కి గల డిమాండ్ ని క్యాష్ చేసుకోడానికి పేరెంట్స్ శ్రద్ధ చూపిస్తున్నారు. ఇంజనీరింగ్ చదివి కూడా చాలామంది ఖాళీగా ఉంటున్నప్పుడు, చదివి ప్రయోజనం ఏమిటి,ఈ రోజు బాలనటుడే రేపటి హీరో అవుతాడేమో అని సతీష్ దంపతుల ఆలోచనగా ఉంది.