చరణ్ 12 సినిమాల కలెక్షన్స్ చూస్తే మతిపోతుంది
గత ఏడాది రంగస్థలం మూవీతో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించిన రామ్ చరణ్ తన కేరీర్ ని పటిష్టం చేసుకుంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటవారసత్వాన్ని పుణికి పుచ్చుకుని చిరుత మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ,తండ్రి పేరులోని మెగాతో పాటు బాబాయ్ పవన్ కళ్యాణ్ లోని పవర్ స్టార్ ని చేర్చుకుని తన నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం మూవీ తొలిరోజు వరల్డ్ వైడ్ గా 46కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిరుత మూవీ తొలిరోజు 4కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రామ్ చరణ్ ఉత్తమ నూతన నటుడుగా నంది స్పెషల్ జ్యురి అవార్డు అందుకోవడంతో పాటు ఫిలిం ఫేర్ అవార్డు దక్కించుకున్నాడు.ఇక ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రెండు తరాల ప్రేమకథగా వచ్చిన మగధీర మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసింది.
ఈ సినిమాతో 75ఏళ్ళ తెలుగు సినిమా చరిత్ర రికార్డ్ లను తన రెండో సినిమాతోనే తిరగరాసాడు. తొలిరోజు 7కోట్ల గ్రాస్ వసూలు చేసి,మొత్తం మీద 75కోట్ల మార్క్ అందుకున్న హీరోగా సరికొత్త హిస్టరీ సృష్టించాడు. తర్వాత మెగా బ్రదర్ నాగబాబు నిరించిన,బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఆరెంజ్ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. తొలిరోజు 4కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆతరువాత సంపత్ నందు డైరెక్షన్ లో వచ్చిన రచ్చ మూవీ తొలిరోజు 8కోట్ల గ్రాస్ రాబట్టింది. అనంతరం వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన నాయక్ మూవీ లో చెర్రీ డ్యూల్ రోల్ తో అందరినీ మెప్పించాడు. తొలిరోజు 11.5కోట్లు గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఆతర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఎవడు మూవీ లో చెర్రీ నటన బాగున్నా సినిమా అక్కట్టుకోలేదు.
అయితే తొలిరోజు ఆరు కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అమితాబ్ బచ్చన్ జంజీర్ సినిమాకు రీమేక్ గా మాస్ కథతో తెరకెక్కిన ఈ మూవీలో బన్నీ కూడా నటించాడు. తర్వాత గోవిందుడు అందరివాడేలే ఫామిలీ సెంటిమెంట్ మూవీలో నటించాడు. కృష్ణ వంశీ తెరకెక్కించిన ఈ మూవీ తొలిరోజు 8కోట్లకు పైనే గ్రాస్ వసూలు చేసింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బ్రూస్ లీ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయితే తొలిరోజు 16.55కోట్ల గ్రాస్ వసూలు చేసి, చెర్రీ సినిమాల్లో హయ్యెస్ట్ షేర్ గా నిల్చింది. ఆతర్వాత సురేంద్ర రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన దృవ మూవీ తొలిరోజు 10కోట్ల గ్రాస్ వసూలు చేసి, భారీ విజయం నమోదుచేసుకుంది. ఇక రంగస్థలం తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన వినయ విధేయ రామ మూవీ డిజాస్టర్ అయింది. అయినా తొలిరోజు 28కోట్లు వసూలు చేసింది.