టాలీవుడ్ లో ఎవరికి జరగనటువంటి దారుణమైన సంఘటన ఈ హీరోయిన్ ఎదురయింది
నాటి మద్రాసు మేయర్ గా చేసిన తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య మానవరాలైన అలనాటి అందాల నటి దేవిక సినిమాల్లో ఓ ఊపేసింది. నిజానికి ఈమెకు డాన్స్ నేర్పించి మంచి కళాకారిణిగా చూడాలని అమ్మమ్మ తాపత్రయంగా ఉండేది. దేవిక అసలు పేరు ప్రమీలాదేవి1943ఏప్రియల్ 25న చెన్నైలో పుట్టింది. ఒకరోజు పెళ్ళికి వెళ్తూ వాళ్ళ అమ్మమ్మ దేవికను కూడా తీసుకెళ్లింది. అక్కడ ఓ జ్యోతిష్కుడు తారసపడ్డాడు. సంగీతం,డాన్స్ నేర్పిస్తే బాగా రాణిస్తుందని చెప్పాడట. అమ్మకు సంతోషం వేసినా, దేవిక తండ్రికి సంగీతం,డాన్స్ వంటివి పడవట. బాగా చదివించాలని తండ్రి కొరిక.
చాలా భాషల్లో ప్రావిణ్యం గల దేవిక అమ్మమ్మ మొత్తానికి సంగీతం,నాట్యంతో పాటు వీణ,వాయిలెన్ కూడా దేవికకు నేర్పించింది. యుక్త వయస్సు వచ్చాక సినిమాల్లో ఛాన్స్ ల కోసం వాళ్ళ అమ్మమ ట్రై చేస్తే,పుట్టిల్లు సినిమాలో చిన్న వేషం దక్కింది. తెలుగు, తమిళ,హిందీ కల్పి దాదాపు 150చిత్రాల్లో నటించింది. చారిత్రాత్మక,పౌరాణిక నాటకాలకు దేవిక బాగా సరిపోతుందని అందరూ భావించేవారు.1972లో దేవదాస్ అనే వ్యక్తిని పెళ్లాడింది. అయితే 1990లో అతడితో కొన్ని అనివార్య కారణాలతో విడాకులు తీసుకున్న దేవికకు కనక అనే కూతురుంది. కూతురు తమిళ చిత్ర సీమలో అడుగుపెట్టింది. ఇక ఓసారి షూటింగ్ లో దేవిక కు అనుకోని సంఘటన ఎదురైంది. పీఎస్ వీరప్పన్ 1964లో కె శంకర్ డైరెక్షన్ లో అండమాన్ కట్టలై అనే మూవీని నిర్మించగా,అందులో శివాజీ గణేశన్ కి దేవిక జంటగా నటించింది.
ఈ మూవీ షూటింగ్ కి కేరళలోని కోవెలం కి చిత్ర యూనిట్ వెళ్ళింది. సముద్రం దగ్గర షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసారు. అయితే ఆరోజు అమావాస్య కావడంతో సముద్రం నురుగులు కక్కుతూ అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ, అక్కడున్న కొండలను తాకుతున్నాయి. కొండమీద కెరటాల మధ్య దేవిక నటించాలి. కానీ అంతపైకి అలలు వచ్చి తాకుతాయని డైరెక్టర్ ఊహించలేదు. అంతలోనే తాడిచెట్టంత ఆలా ఒకటి ఆమెను తాకి సముద్రంలోకి ఈడ్చుకుపోయింది. గజ ఈతగాళ్లు ఆమెను కాపాడ్డానికి అనుసరించారు. అయితే మరో ఆలా వచ్చి ఆమెను కొండమీదికి నెట్టేసింది. ఆమె ఒంటికి సూదంటు రాళ్లు గుచ్చుకోవడం, ఇంతలోనే మరో అల వచ్చి ఆమెను సముద్రంలోకి లాక్కెళ్లడంతో గజఈతగాళ్ళు రక్షించారు. ఓ అదృశ్య శక్తి కాపాడిందని చెబుతూ ఉండే ఆమె,ఆ ఘటన గుర్తొస్తే చాలు కలవరపాటుకు గురయ్యేది. ఇదే మూవీని ప్రేమించి పెళ్లి చేసుకో పేరిటడబ్ చేసారు. 2002లో మరణించిన దేవిక ఈలోగా వీడింది.