Movies

సావిత్రమ్మను ఇంటికి రావద్దు అంటూ మాట తీసుకున్న అల్లుడు… సమర్ధించిన కూతురు… కారణం ఏమిటి?

కరుణ రసాత్మక జీవితానికి నిలువెత్తు నిదర్శనం గా చెప్పుకునే మహానటి సావిత్రి ఉన్నతస్థాయికి వెళ్లి అధః పాతాళానికి పడిపోయింది. చిగురించి,పుష్పించిన చెట్టు ఆతరువాత ఆకురాలి ఎండిపోవడం సహజం కదా. అలాగే సావిత్రి జీవితం కూడా. ఆమెకు ఇద్దరు పిల్లలు. జెమిని గణేశన్ తో విడిపోయాక ఇద్దరు పిల్లలు ఆమెను బాగానే చూసుకున్నారని అనుకుంటాం. సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరిని మేనల్లుడుకి ఇచ్చి పెళ్ళిచేసింది. జెమిని ఈ పెళ్ళికి రాకపోయినా ఆయన భార్య వచ్చింది. పెళ్లి ఘనంగా జరిగింది. అల్లుడుకి అత్త ఆశ అన్నట్లు అల్లుడిని చూసి సావిత్రి ఎంతో సంబరపడింది. కానీ సీన్ రివర్స్ అయింది. ఇక్కడితో మీ అమ్మను మర్చిపోవాలని పెళ్లయ్యాక చాముండేశ్వరితో గోవిందరావు అన్నాడు. నిజానికి అత్తపట్ల సానుకూల దృక్పధం ఉన్నప్పటికీ వాళ్ళూ వీళ్లూ కలిపి అతడి మనసు విరిచేలా,’మీ అత్త పచ్చి తాగుబోతని,నోటికి ఎంతొస్తే అంతే అనేస్తుందని చాడీలు చెప్పడం వలన అతడిలో మార్పు వచ్చేసింది.

ఇంటిగుమ్మం తొక్కనివ్వవద్దని అల్లుడు ఆర్డర్ వేసాడు. పెళ్లయ్యాక భర్త,పిల్లకు పెళ్లయ్యాక కూతురు దూరం, లంకంత ఇల్లు జప్తు,ఐటి దాడులు ఇలా సావిత్రి జీవితంలో అన్నీ కష్టాలే. ఏడువారాల నగలు ఎలా పోయాయో ఎవరికీ తెలీదు. జీవితంలో ఒంటరిగా మిగిలిన సావిత్రి అన్నా నగర్ లో 500రూపాయల అద్దె ఇంటికి చేరింది. ఒకప్పుడు హబీబుల్లా రోడ్డు మొత్తం సాత్రిదే అన్నట్లు ఉండే వాతావరణం ఇలా మారిపోయింది. దేవదాసు మళ్ళీ పుట్టాడు వంటి సినిమాల్లో చిన్న చిన్న వేషాలు ఇస్తున్న సమయంలోనే ఆమెకు సన్మానం పెట్టి ఆహా ఓహో అంటూ పొగిడేశారు.మహానటి అంటూ ఆకాశానికి ఎత్తేయడంతో నేను మహానటిని అయితే ‘నాకు వేషాలు ఎందుకు ఇవ్వడం లేదు.

దేవత అంటున్నారు. అందుకేనా ఊరి చివరికి తరిమేశారు. కనీసం ఏడాదికి ఒకసారైనా జాతరకు వచ్చి చూస్తారు కదా. అలా కూడా చేయడం లేదు’అని సావిత్రి నిలదీసింది. ఆత్మలేని మీలాంటి వాళ్ళకోసమా నేను ఆత్మకథ రాయాలా అని మండిపడింది. ఇక బెంగుళూరులో లిఫ్ట్ దగ్గర ఆమె పడిపోయింది. అప్పుడు సరైన వైద్యం  అందించి ఉంటే బాగుండేది. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో నటి లక్ష్మి వచ్చి ఆమెను గుర్తించి, కొంచెమే సాయం చేసారు. ఇక కోమాలోకి వెళ్ళిపోయి,18నెలల పాటు మంచాన పడింది. మధ్య మధ్యలో జెమిని గణేశన్ వచ్చి చూడడమే తప్ప ఇంకెవరూ రాలేదు. కొందరు అభిమానులు డబ్బు పంపేవారట. జమున తన పరపతిని ఉపయోగించి ఆదుకునే యత్నం చేసిందేమో గానీ ఇక ఎవరూ కన్నెత్తి చూడలేదు. కూతురు కూడా రాలేదు. ఎన్టీఆర్ ,అక్కినేని వంటివాళ్ళు కూడా అసలు పట్టించుకోలేదు.