Movies

సెకండ్ ఇన్నింగ్స్ కోసం టబు సంచలన నిర్ణయం

విక్టరీ వెంకటేష్ కూలి నెంబర్ వన్ తో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ టబు తెలుగులో పలు సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. నాగార్జున నటించిన నిన్నే పెళ్లాడతా మూవీతో తారాస్థాయికి చేరింది. పండు పాత్రతో ఎంతో పాపులార్టీ వచ్చేసింది. వరుస సినిమాలు చేసి కొంత గ్యాప్ తర్వాత పాండురంగడు మూవీ చేసినా అది డిజాస్టర్ అయింది. 

ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసింది. ఈమె చేసిన అజయ్ దేవగన్ తో కల్సి చేసిన హిందీ మూవీ శుక్రవారం విడుదల అవుతోంది. అజయ్ , రకుల్ ప్రీత్ సింగ్ కల్సి నటించే ఈ మూవీలో మాయలో మాజీ భర్తను రక్షించుకునే పాత్రను టబు చేస్తోంది. ఇలాంటి రిస్క్ పాత్రలు చేయడం అంటే ఈమెకు ఎంతోఇష్టం. సెకండ్ ఇన్నింగ్స్ చాలా బాగుందని, ముందు ముందు ఇంకా చూస్తారని అంటోంది. 

భాషతో సంబంధం లేకుండా వెరైటీ రోల్స్ చేస్తున్నానని , కథ నచ్చితే సినిమా ఒప్పుకుంటానని టబు అంటోంది. ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తనే హత్య చేసే సైలెంట్ కిల్లర్ గా టబు చేసిన అందా దుం సినిమా కారణంగా ఆమె కెరీర్ మళ్ళీ ఊపందుకుందని అంటారు. టాలీవుడ్ లో మంచి పేరున్న టబు తాజాగా త్రివిక్రమ్,అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చే మూవీ చేస్తోంది. మరి టాలీవుడ్ లో ఈమెకు ఎలాంటి రోల్స్ ఇస్తారో చూడాలి.