Movies

కార్తీక దీపం సీరియల్ విహారి(వేణు) ఎవరి కొడుకో తెలుసా….ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా?

కార్తీక దీపం సీరియల్ లో తులసికి భర్తగా వేసిన వేణు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నవంబర్ 6ఇతడి పుట్టినరోజు. ఇతడి తండ్రి డాక్టర్ ప్రసాదరావు జిఎస్. ఆయనొక డాక్టర్.  1994లో జ్యోతి బాలామందిర్ హైస్కూల్ లో చదువుకున్నాడు.

హైదరాబాద్ అమీర్ పేట ఎల్లారెడ్డి గుడాలో మాదాల రామారెడ్డి లా కాలేజీలో చదివాడు.ఆతరువాత వేణు, విఎం కాలేజీ,డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలలో కూడా చదివాడు. సెయింట్ పాట్రిక్స్ పీజీ కాలేజీలో చదివాడు. 2008లో జెమినిలో ప్రసారమైన శ్రావణి సుబ్రహ్మణ్యం అనే సీరియల్ లో వేణు హీరోగా చేసాడు. 

శ్రావణి సుబ్రహ్మణ్యం అనే సీరియల్ కి గురుసంపత్ కథ అందించాడు. గట్ రెడ్డి హరిప్రసాద్ డైరెక్ట్ చేయగా,వికేతన్ నిర్మించారు. శ్రీలక్ష్మి,కీర్తి,నరసింహారాజ్ ,శృతి రాజ్,రత్న సాగర్ వంటి యాక్టర్స్ నటించారు. ఇక 2002లో వచ్చిన ప్రేమంటే సినిమా లో వేణు హీరోగా చేసిన మొదటి మూవీ. కాగా 2017మే 1నుంచి వాల్ కామ్స్ అనే కంపెనీలో పనిచేసున్నా రోహిణి అనే అమ్మాయిని వేణు పెళ్లిచేసుకున్నాడు .