మహేష్ బాబు అరుదైన రికార్డ్…. టాలీవుడ్ లో ఏ హీరోకి లేదు….రాదు
సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకెళ్తూ తాజాగా విడుదలైన మహర్షి మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మహేష్ 25వ చిత్రంగా విడుదలైన ఈ మూవీ లో తన హ్యాండ్ సమ్ లుక్ తో అభిమానులను అలరించాడు. పైగా అందగాడు కూడా. రోజురోజుకి వయస్సు తగ్గుతున్నట్టే ఉంటాడు తప్ప పెరిగినట్లు కనిపించడు. యంగ్ ఫాన్స్,లేడీ ఫాలోయింగ్ ఎక్కువ కల హీరో కూడా మహేష్ బాబు అని చెప్పవచ్చు. ఇక మహేష్ కెరీర్ లోనే మహర్షి మూవీ అత్యధిక వసూళ్లు రాబట్టింది.
తొమ్మిది రోజుల్లో మహర్షి మూవీ 200కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. రన్నింగ్ లో కూడా ఈ మూవీ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలవబోతోంది. ఇక తాజాగా మహేష్ మరో రికార్డు కూడా సాధించాడు. టైమ్స్ మ్యాగజైన్ ప్రతియేటా మోస్ట్ డిజైరబుల్ మెన్ అండ్ వుమెన్ జాబితా రూపొందిస్తుంది. అలాగే డిజైరబుల్ క్లబ్ పేరిట మరో జాబితా కూడా ప్రకటిస్తుంది. టాప్ స్థానంలో నిలిచే కొందరికి మాత్రమే ఈ జాబితాలో చోటు కల్పిస్తారు. ప్రతియేటా ఈ ప్రాసెస్ ఉంటుంది.ఈవిధంగా సల్మాన్ ఖాన్ ,షారూఖ్ ఖాన్,అక్షయ్ కుమార్,అమీర్ కుమార్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోలకే ఇప్పటివరకూ పరిమితం అవుతూ వస్తున్న ఈ జాబితాలో మహేష్ కి చోటు దక్కింది.
దీంతో సౌత్ ఇండియాలోనే ఈ జాబితాలో ఛాన్స్ కొట్టేసిన తొలి హీరోగా రికార్డ్ క్రియేట్ చేసాడు. నిజానికి ఇలాంటి అరుదైన రికార్డ్ సాధించే సత్తా మహేష్ కి మాత్రమే ఉందని అభిమానులు అంటున్నారు. ప్రతియేటా టాప్ ప్లేస్ లో మహేష్ పేరు వస్తున్నందున ఏకంగా క్లబ్ లో చేర్చేసారు. ఈ జాబితాలో చోటు దక్కాలంటే, సినిమాల్లో ఫాలోయింగ్ తో పాటు ఎక్కువమంది ఆడియన్స్ మెప్పు పొంది ఉండాలి. టైమ్స్ మోస్ట్ ఫర్ ఎవర్ డిజైర్ బుల్ క్లబ్ లో మహేష్ కి చోటు దక్కడంతో ఫాన్స్ కి ఆనందంతో ఉబ్బి తబ్బిబవుతున్నారు.