అయ్యో పాపం .. అఖిల్ నాలుగో సినిమా ఏమి అవుతోందో…???
సినిమా రంగం అందరికీ ఒకేలా ఉండదు. ఎలాంటి సపోర్ట్ లేకున్నా కొందరు దూసుకుపోతారు. ఎంత సపోర్ట్ ఇచ్చినా కొందరు అందుకోలేరు. సుదీర్ఘ చరిత్ర గల అక్కినేని ఫామిలీ నుంచి మూడవ తరం హీరోగా వచ్చిన అఖిల్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే అఖిల్ నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. హిట్ కోసం ఎంత ప్రయత్నించినా దరిచేరడం లేదు. టాలెంటెడ్ దర్శకులతో పని చేసినా, సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఇప్పటి వరకు హిట్ మాత్రం ఖాతాలో పడలేదు. అందుకే నాగ్ చిన్న కొడుకు విషయంలో మాత్రం టెన్షన్ పడుతూనే ఉన్నాడు. నాగచైతన్యకు చెప్పుకోడానికి కొన్ని హిట్లు ఉన్నాయి. కానీ అఖిల్ ఇంకా ఆ క్లబ్బులోనే చేరలేదు. ఇక ఇప్పుడు నాలుగో సినిమా విషయానికి వస్తే, డిజాస్టర్ డైరెక్టర్‌తో చేయబోతున్నాడు.
దాదాపు తెలుగు ప్రేక్షకులు అంతా మరిచిపోయిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తాడని అంటున్నారు. అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు కానీ ఇప్పటికే దీనికోసం కథ కూడా లాక్ అయిందంటున్నారు. అయితే అఖిల్ మాత్రం మైనస్ మైనస్ ప్లస్ అవుతుందని నమ్ముతున్నాడు. భాస్కర్ చెప్పిన కథ బాగా నచ్చడంతోనే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. పైగా ఫస్టాఫ్ వరకు కథ అదిరిపోయిందని, సెకండాఫ్ కూడా అందుకు తగ్గట్టు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోనీ అన్నీ బాగానే ఉన్నా కూడా ఇప్పటి వరకు ఈ చిత్రం పట్టాలెక్కకపోవడానికి కారణం మాత్రం బడ్జెట్ అని అని అంటున్నారు. భారీ బడ్జెట్ కావాల్సి రావడంతో నాగార్జున డబ్బులు పెట్టడానికి కూడా ముందుకొచ్చినట్లు ప్రచారం వైరల్ అయింది. ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. మొన్న వచ్చిన మిస్టర్ మజ్ను సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఎలాంటి సినిమా చేయాలో తెలియక తికమకపడుతున్నాడు అఖిల్. పైగా నాగ్ కూడా కొడుకును ఏ దర్శకుడి చేతిలో పెట్టాల తెలియక తర్జన భర్జన పడుతున్నాడు.
ఇలాంటి సమయంలో ఆయన్ని తీసుకెళ్లి భాస్కర్ చేతిలో పెట్టడం కాస్త కంగారు పెట్టే విషయమే అయినా కథపై నాగార్జున నమ్మకంగా ఉన్నాడు. అయితే బడ్జెట్ ప్రాబ్లమ్ ఒక్కటే కాకుండా కథ విషయంలోనూ నాగార్జున కాస్త కంగారు పడుతున్నాడు. అన్నీ పర్ ఫెక్ట్ అయిన తర్వాత ఈ సినిమా మొదలు పెట్టాలని భావిస్తున్నాడట. ఇక ఈ చిత్రంలో అఖిల్ సరసన కియారా అద్వానీ, రష్మిక మందన్నలలో ఎవరో ఒకర్ని హీరోయిన్‌గా తీసుకుంటారని టాక్. ఇప్పటి వరకు కొత్త హీరోయిన్లతో జోడీ కడుతూ వచ్చిన అఖిల్, కి కొత్త హీరోయిన్లు అస్సలు కలిసి రావడం లేదు. దాంతో స్టార్ హీరోయిన్ వైపు అడుగులు వేస్తున్నాడు. తొలిసారి స్టార్ హీరోయిన్‌తో రొమాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడన్నమాట. మరి ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.