నాజర్ తల్లితండ్రులను ఎందుకు దూరం పెట్టాడో తెలుసా? సోదరుల ఆరోపణలు
వైవిధ్యమైన పాత్రల తో దాదాపు అన్నీ భాషల్లో నటించి అందరిని మెప్పించిన విలక్షణ నటుడు,సీనియర్ ఆర్టిస్ట్ నాజర్ దక్షణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడి గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటూ, వివాదాస్పదం అయ్యాడు. సాక్షాత్తు అతని సోదరులు పలు ఆరోపణలు చేస్తున్నారు. సినిమాల్లో గొప్పగా నటించే నాజర్ సొంత తల్లి దండ్రులను మాత్రం పట్టించుకోవడం లేదని అతడి సోదరులు జవహర్,ఆయూబ్ లు ఆరోపిస్తున్నారు.వృద్ధాప్యంలో ఉన్న తల్లి దండ్రుల కనీస భాద్యతలను కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు.
నిజానికి నాజర్ ఫ్యామిలీ లో నాజర్ పెద్ద వాడు. ఆయన తరువాత ముగ్గరు సోదరులు కూడా ఉన్నారు. అయితే చివరి సోదరుడు మానసిక వ్యాధిగ్రస్తుడు కావడంతో అతడి బాగోగులు కూడా తల్లి దండ్రులే చూస్తున్నారు.అయితే పెళ్లి అయిన తరువాత తమ సోదరుడు నాజర్ వేరుగా వెళ్లిపోయారని, కనీసం కన్న తల్లి దండ్రుల గురించి పట్టించుకోవడం లేదంటూ మిగిలిన ఇద్దరు సోదరులు ఆరోపిస్తున్నారు.
ఆర్ధికంగా సెటిల్ అయిన నాజర్ తల్లి దండ్రులను పట్టించుకోకపోవడం తో ఆయన సోదరులమైన మేము వారి భాద్యత తీసుకున్నామని, అయితే మేమిద్దరమే కుటుంబ భారాన్ని మోయడం చాలా కష్టం అయిపోతుందని అందుకే ఇప్పటికైన కుటుంబానికి అండగా ఉండాలని వారు కోరారు. ఒకవేళ ఇప్పుడు కూడా భాద్యత తీసుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా సిద్దమే అంటూ వారు హెచ్చరిస్తున్నారు. నిజానికి సినిమాలలో ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ వేస్తూ మెప్పిస్తున్న నాజర్ కుటుంబాన్ని ఎందుకు పట్టించు కోకుండా గాలికి వదిలేయడం దారుణమని పలువురు అంటున్నారు.