రాళ్ళపల్లి ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ,కమెడియన్ గా తన స్టామినా చూపించిన నటుడు రాళ్ళపల్లి దాదాపు 850 సినిమాలకు పైగా నటించి తనదైన ముద్ర వేసాడు. తనికెళ్ళ భరణి వంటివాళ్లకు రాళ్ళపల్లి రోల్ మోడల్. నాటక రంగ కళాకారుడిగా ఎన్నో నాటకాలను రంచించి,నటించారు. ఇక సినిమాల్లోకి రాకముందు రైల్వేలో ఉద్యోగం చేస్తూ ఆరోజుల్లో నెలకు 2వేలు జీతం తీసుకునేవారు. సినిమాల్లోకి ప్రవేశించాక ఉద్యోగాన్ని వదిలేసారు. ఇక తొలిచిత్రం స్ర్రీ మూవీకి 300 పారితోషికం అందుకున్నాడు. ఊరుమ్మడి బతుకులు మూవీకి 800తీసుకున్నాడు. ఉన్నదాంట్లో సుఖంగా కాలం గడపడమే తప్ప గొప్పలకు పోయే మనస్తత్వం ఆయనికి లేదు.
రాబడి ,ఖర్చు రెండూ లెక్కలు వేసుకుని మరీ జీవనం సాగించేవాడు. కొడుకులు లేరు. ఉన్నది ఇద్దరు కూతుళ్లే . వచ్చిన సొమ్ముని దుబారా చేయకుండా ఇద్దరి కూతుళ్ళ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసాడు. పెద్దకూతురు హఠాత్తుగా చనిపోగా, డిపాజిట్స్ తీసి చిన్నకూతురికి ఇచ్చేసాడు. ఇక రాళ్లపల్లికి ఫిలిం నగర్ ఏరియాలో రెండు సొంత ఇళ్లున్నాయి. సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినపుడు తక్కువ ధరకు స్థలం కొన్నాడు. అందులో ఇల్లు కట్టాడు. అలాగే కళాకారులకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో కూడా ఓ ఇల్లు కట్టాడు. దాంతో ఓ ఇల్లు అద్దెకిచ్చాడు. కాగా గచ్చిబౌలి స్టేడియం ఏరియాలో ఖాళీ స్థలాలు ఉన్నాయని అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 30ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నట్టు భోగట్టా. మొత్తం మీద కోట్లలోనే ఆస్తులున్నట్లు తెలుస్తోంది.