రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య విభేదాలకు కారణం ఎవరో తెలుసా?
ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్‌లా కలిసి సినిమాల్లో కూడా నటించిన మెగా పవర్‌స్టార్ రాం చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య ఇప్పుడు పొసగడం లేదా? నిజానికి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ ఇద్దరు స్టార్ల మధ్య విబేధాలు స్టార్ట్ అయ్యాయా? ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు అస్సలు పడకపోవడానికి కారణం ఏమిటి వంటి అనుమానాలే ఇప్పుడు టాలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న వార్తలే ఇందుకు ప్రధాన కారణం. ఇక అటు అల్లు అర్జున్ గానీ, ఇటు రాం చరణ్ గానీ స్పందించక పోవడంతో ఈ వార్తల్లో కాస్తో కూస్తో నిజం ఉండొచ్చనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే తాజాగా ‘ఏబీసీడీ’ సినిమాతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు బాక్సాఫీస్ దగ్గరకు అల్లు అర్జున్ తమ్ముడు, మెగా హీరో అల్లు శిరీష్ వచ్చాడు. ఈ మూవీ అల్లు శిరీష్ ఆశిస్తున్న విజయాన్ని అందించలేకపోయింది. మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ‘ఏబీసీడీ’… అల్లు శిరీష్ ఖాతాలో మరో ఫ్లాప్‌ను చేర్చినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఈ పరిణామాలపై అల్లు శిరీష్ స్పందిస్తూ అసలు ఈ వార్తల్లో నిజం లేదని, కేవలం క్లిక్స్ కోసం కొందరు క్రియేట్ చేసిన రూమర్స్ మాత్రమేనని కుండబద్ధలు కొట్టినట్లు ప్రకటించాడు. రాం చరణ్, అల్లు అర్జున్ చిన్నతనం నుంచి కలిసి పెరిగారని అల్లు శిరీష్ చెబుతూ, అందుకే వారిద్దరి మధ్య మంచి స్నేహానుబంధం ఉందని తెలిపాడు. బయటికి కనిపించకపోయినా ఇద్దరూ తరుచుగా కలుసుకుంటూ, చాలా విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటారని అల్లు శిరీష్ చెప్పాడు. రాం చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’ సినిమాలో అల్లు అర్జున్ ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్ ఓ సినిమా ప్రమోషన్లో పాల్గొంటూ, రాం చరణ్ తన తమ్ముడిలాంటి వాడని చెప్పాడు కూడా. అయితే ఓ సినిమా ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి ఆయన గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ‘చెప్పను బ్రదర్’ అంటూ బన్నీ అప్పట్లో చేసిన కామెంట్స్, ఇండస్ట్రీలో పెను దుమారం లేపాయి.
ఆ తర్వాత అల్లు అర్జున్‌కీ, పవన్ కల్యాణ్‌కీ పడడం లేదనే టాక్ బాగా వినిపించింది. రాం చరణ్ మాత్రం బాబాయ్‌కి ఆప్తుడిగా మెలుగుతుండడంతో ఈ విషయంలో బన్నీకీ-చెర్రీకి మధ్య చెడిందనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అదేం లేదని తాజాగా స్పష్టం చేశాడు అల్లు శిరీష్. మెగా హీరోలందరి మధ్య ఎలాంటి ఈగో ప్రాబ్లమ్స్ లేవనీ, అందరం కలిసే ఉన్నామని అల్లువారి అబ్బాయి క్లారిటీ ఇచ్చాడు. ఈ సారి ప్రత్యేక్ష రాజకీయాల్లో బరిలో నిలిచిన తన మేనమామ పవన్ కల్యాణ్ గురించి కూడా అల్లు శిరీష్ ప్రస్తావించాడు ‘నాకు పవన్ కల్యాణ్ గారంటే ఎంతో ఇష్టం. ఆయన జనసేన పార్టీకి మా మద్ధతు ఎప్పుడూ ఉంటుంది. అన్నయ్య అల్లు అర్జున్ కూడా జనసేన పార్టీకి బహిరంగంగానే మద్ధతు ప్రకటించారు. రాం చరణ్ అయితే స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్, నాగబాబులతో ప్రచారంలో కూడా పాల్గొన్నారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. రావు’ అని అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు .