Movies

చెల్లి పాత్రలతో కన్నీళ్లు పెట్టించిన ఈ నటీమణులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా?

తెలుగు సినిమాల్లో సెంటిమెంట్స్ తో తీసిన సినిమాలు ఎక్కువే కనిపిస్తాయి. గతం నుంచి ఇప్పటిదాకా తల్లీ,చెల్లి సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. చెల్లి పాత్రలతో అలరించిన నటులు ఎందరో ఉన్నారు. గతంలో రక్త సంబంధం మూవీలో ఎన్టీఆర్ చెల్లెలిగా మహానటి సావిత్రి నటించి ఎంతగా మెప్పించిందో చెప్పక్కర్లేదు. హిట్లర్ మూవీలో మెగాస్టార్ చిరంజీవికి సిస్టర్స్ గా అశ్విని, మోహిని, గాయత్రీ,వీణా కుమారి,పద్మిని నటించారు. వాసు సినిమాలో వర్ష, తొలిప్రేమ సినిమాలో వాసుకి కూడా సిస్టర్స్ గా నటించారు. పుట్టింటికి రా చెల్లి సినిమాలో అర్జున్ చెల్లిగా నటించిన మధుమిత హైదరాబాద్ అమ్మాయి. ఈ సినిమాను కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసాడు.

2015లో భలే భలే మగాడివోయ్ సినిమాలో చివరి సారిగా నటించింది. బిగ్ బాస్ శివ బాలాజీని పెళ్ళాడి ఇద్దరు పిల్లల తల్లయింది. ప్రస్తుతం రీ ఎంట్రీ ఇస్తూ, వినయ విధేయ రామ మూవీలో నటించి, వరుస సినిమాల్లో బుక్ అవుతోంది. అలాగే తొలిప్రేమ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ సరసన నటించిన కీర్తి రెడ్డి అర్జున్ సినిమాలో మహేష్ బాబు సిస్టర్ గా మంచి నటన కనబరించింది. అక్కినేని మనవడు సుమంత్ ని పెళ్ళాడి, ఆతర్వాత పొసగక రెండేళ్లకే విడాకులు ఇచ్చేసిన ఈమె ఓ ఎన్ ఆర్ ఐ డాక్టర్ ని పెళ్ళాడి విదేశాలకు వెళ్ళింది. ఇక అన్నవరం సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెల్లెలుగా నటించిన సంధ్య విషయానికి వస్తే, ప్రేమిస్తే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.

తమిళంలో వచ్చిన సినిమా కి డబ్బింగ్ అయిన ఈ సినిమాలో సంధ్య నటన సూపర్బ్. ఒక టీనేజ్ అమ్మాయిగా తనకన్నా తక్కువ వాడైనా మెకానిక్ ని ప్రేమిస్తుంది. అయితే ఇంట్లో వాళ్ళు దీన్ని పసిగట్టి ,ఆమెకు మరొకరితో పెళ్లి చేసేస్తారు. అయితే  మెకానిక్ ఆ  తర్వాత పిచ్చోడు అయిపోతాడు. ఈ సినిమా హిట్ కొట్టింది. దీంతో తమిళంలో సూపర్ హిట్ అయిన తిరుప్పాచ్చి మూవీని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా అన్నవరం పేరిట రీమేక్ చేసారు. ఇందులో పవన్ చెల్లిగా సంధ్య నటించింది. ఈ సినిమా కూడా హిట్ అయింది. 2015లో తమిళంలో,2016లో మళయాళీ మూవీలో ఆఖరుగా నటించింది. అయితే ఆతర్వాత సంధ్య పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది.

చెన్నైలో సెటిల్ అయ్యి, ఓ పాపకు జన్మనిచ్చింది. సంధ్య వాస్తవానికి మళయాళీ అమ్మాయి. అయితే ఈమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి నాలుగు మూవీస్ కి ఒకే చెప్పింది. అందులో ఓ సినిమా పేరు సెకండ్ ఇన్నింగ్స్ కావడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన రాఖీ మూవీలో హీరో చెల్లెలి పాత్రలో మంజూష నటించింది. ఆ సినిమాలో ఆమె నటన అదిరిపోయింది. అయితే ఆతర్వాత పెద్దగా సినిమాల్లో రాణించలేదు. అయితే యాంకర్ గా బిజీ అయింది. 2002లో హిట్ కొట్టిన శివరామ రాజు సినిమాలో జగపతి బాబు ముగ్గురు సోదరులకు ఏకైక ముద్దుల చెల్లిగా మౌనిక నటించింది.

చిన్నపుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా 20సినిమాల వరకూ చేసిన మౌనిక పెద్దయ్యాక తెలుగు,తమిళ,మళయాళ చిత్రాల్లో 30సినిమాల దాకా చేసింది. 2016లో తమిళ మూవీతో నటనకు గుడ్ బై చెప్పేసి,సేలం కి చెందిన మాలిక్ ని పెళ్ళాడి ఇస్లాం స్వీకరించి రహీమా గా పేరు మార్చుకుని,ఇంటి పట్టునే ఉంటోంది. గుడుంబా శంకర్ మూవీతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయిన మీరా జాస్మిన్ గోరింటాకు మూవీలో రాజశేఖర్ చెల్లిగా నటించింది. అయితే ఈమె పెళ్లయినవాడినే పెళ్ళాడి,సమస్యలు తెచ్చుకుంది. ఇతడితో తర్వాత తెగతెంపులు చేసుకుని, ఫోటో షూట్స్ తో సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. గత ఏడాది తమిళ మూవీస్ లో నటించి రీ ఎంట్రీ కి దారులు తెరిచింది.