Movies

ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీనివాస రెడ్డి

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో అందరూ కలివిడిగా మెలిగేవారని అంటారు. కానీ ఇప్పుడు కూడా స్టార్ హీరోలు తోటి నటులతో సఖ్యంగానే ఉంటున్నారు. అందరితో మంచిగా ఉంటె వచ్చే ప్రయోజనాలను తెల్సుకుంటున్నారు. స్టార్ హీరోలలో సఖ్యత చూపే వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ ని ప్రధానంగా చెప్పుకోవాలి. రాజీవ్ కనకాల,రాఘవ,శ్రీనివాసరెడ్డి,రఘు,సమీర్ ఇలా చాలామందితో ఎంతో దగ్గరగా మసలుతూ ఉంటాడు. వీళ్ళలో శ్రీనివాస రెడ్డితో ఈమధ్య కొంచెం క్లోజ్ నెస్ తగ్గింది. అలా ఎందుకయిందో శ్రీనివాసరెడ్డి తాజాగా వెల్లడించాడు. 

పెళ్ళికావడం,పిల్లల్ని కనడం, వేరు వేరు సినిమాల్లో మంచి క్యారెక్టర్స్  దొరకడం వలన ఎన్టీఆర్ మూవీస్ లో కనిపించలేకపోయానని శ్రీనివాస రెడ్డి చెప్పాడు. ‘ఇక అప్పట్లో తారక్ తో కల్సి ఎన్నికల ప్రచారానికి వెళ్ళినపుడు ఖమ్మంలో బహిరంగ సభ ఏర్పాటుచేశారు. నేను,రాజీవ్ కనకాల, సమీర్ హాజరయ్యాం. అందరం ఒక్కొక్కరోజున ప్లాన్ ప్రకారం ప్రచారంలో పాల్గొన్నాం. ఖమ్మం సభ విజయవంతం కావడం,పండుగ సెలవలు కావడంతో ఊళ్లకు బయలుదేరాం. తారక్ కారు ఎక్కమన్నారు. కానీ నా ప్లేస్ లో వేరొకరు ఎక్కారు’అని వివరించాడు. ఐతే నేను వేరే కారులో వెనకాల వెళ్లానని శ్రీనివాసరెడ్డి చెప్పాడు.

ఇక తారక్ కారుకి ప్రమాదం జరిగింది. వెంటనే దిగి చూస్తే తారక్ గాయాలతో రక్తం ఓడుతో కనిపించాడు. నా దగ్గర గల టవల్ చుట్టి,నేనున్న కారులో ఎక్కించుకుని హాస్పిటల్ కి తీసుకెళ్ళాను. అయితే ఆసమయంలో ఓ వ్యక్తి నా దగ్గరకొచ్చి నీ లెగ్ పడింది. తారక్ కారుకి ప్రమాదం జరిగిందని అన్నాడు. పరోక్షంగా ఈ ప్రమాదానికి నేనే కారణమన్నట్లు మాట్లాడడంతో నాకు చాలా కోపం వచ్చేసింది. నా వల్లనే తారక్ బయట పడ్డాడు అనేశాను. దీన్ని తప్పుగా ఎన్టీఆర్ కి చెప్పేసి వుంటారు.
 

అందుకే తారక్ మూవీస్ లో ఛాన్స్ లు రాలేదేమో”అని శ్రీనివాసరెడ్డి అన్నాడు. ఎన్టీఆర్ చుట్టూ గల వ్యక్తులే మా మధ్య ఈ గ్యాప్ రావడానికి కారణమని వాపోయాడు. ‘ఇక మధ్యలో సరదాగా కలిసినప్పటికీ మా మధ్య అనురాగం తగ్గిందని అనిపించింది. రాజీవ్ కనకాల,తారక్ లకు నేనేంటో తెలుసు. అందుకే తారక్ దగ్గరే విషయం తెల్సుకుంటా. ఒకవిధంగా నేను ఎన్టీఆర్ తగ్గరకు వెళ్లి విషయం విడమరిచి మాట్లాడి ఉంటె ఈ గ్యాప్ ఉండేది కాదేమో’అని పేర్కొన్నాడు.