Movies

విదేశీ టూర్లతో మన సింగర్ల కు వచ్చే సొమ్ము ఎంతో తెలుసా?

ఒకప్పుడు పాట పాడాలంటే ఛాన్స్ వస్తుందో రాదో చెప్పలేం కానీ ఇప్పుడు టివి షోల్లో పాడుతా తీయగా.. బోల్ బేబి బోల్.. సూపర్ సింగర్స్.. సరిగమప (తెలుగు- హిందీ) ఇలా ఔత్సాహికులు పాడేందుకు వేదిక గా నిలుస్తున్నాయి. గాయకుల్లో ప్రతిభను వెలికి తీసిన కార్యక్రమాలివి. ఇలాంటి ఎన్నో బుల్లితెర కార్యక్రమాలు బయటి ప్రపంచానికి తెలియని సింగింగ్ ట్యాలెంట్ ని బయటపెడుతూ వారికి అవకాశాలు – ఉపాధిని కల్పిస్తున్నాయి. ఒకవిధంగా వీళ్ళందరికీ పాడే అవకాశాలు కల్పించిన మన మ్యూజిక్ డైరెక్టర్లను దేవుళ్లతో సమానంగా చూస్తున్నారు. 

అందుకే, నేటితరం గాయనీగాయకుల సంపాదన విషయానికి వస్తే, ఒక్కొక్కరి రేంజ్ ఒక్కో విధంగా ఉంటుంది. డిమాండ్ ని బట్టి పారితోషికాలు ఉంటున్నాయి. ఉపాధి సరిపడా ఉంటుందా? అంటే ఇక్కడా వెతుక్కునేవాళ్లకు బోలెడన్ని కార్యక్రమాలతో ఉపాధి దొరుకుతోంది. ఓవైపు ఆదుకునేందుకు పెద్ద తెరతో పాటు బుల్లితెర షోలు, కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి. మొత్తానికి ప్రతిచోటా సింగింగ్ ట్యాలెంట్ కి అవకాశాలు కల్పించే ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేస్తున్నారు. సినిమాలకు పాడుతూనే, ఇతర మార్గాల్లో బుల్లితెర కార్యక్రమాలతో ఆర్జించే అవకాశం అందివస్తోంది. అందుకే యంగ్ ట్యాలెంటెడ్ సింగర్లకు ఇప్పుడు అవకాశాలు పెరిగాయి. ఉర్రూతలూగించే సత్తా మీలో ఉంటే విదేశాలకు విమానం టిక్కెట్లు ఫ్రీ. అమెరికా.. కెనడా.. బ్రిటన్.. దుబాయ్ కాదేదీ కాన్సెర్టుల కు వెళ్లే ఛాన్స్ వస్తోంది. తెలుగు ట్యాలెంట్ ఉన్న ప్రతి విదేశం ఉపాధినిచ్చేదే అని అంటున్నారు. 

ఇక మన టాప్ మ్యూజిక్ డైరెక్టర్లంతా అమెరికా- బ్రిటన్- దుబాయ్- సింగపూర్ సహా విదేశాల్లో టూర్ లు ప్లాన్ చేస్తూ యంగ్ సింగర్స్ కి అవకాశాలు కల్పిస్తున్నారు. అసలు నవతరం గాయనీగాయకులు విదేశీ కాన్సెర్టులకు వెళితే ఎంత సంపాదించవచ్చంటే, ఒక్కో విదేశీ ట్రిప్ లకు రూ.2లక్షల నుంచి 5లక్షల వరకూ ఉంటుందట. టాప్ రేంజు కు రూ.5లక్షల నుంచి 10లక్షలు..(విమానం టిక్కెట్లు.. తిండి-బస సౌకర్యాలు అదనం) రేంజును బట్టి ప్యాకేజీ ఉంటుందని ఓ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ వ్యాఖ్యానించారు. 
గతంలో ఇళయరాజా లైవ్ కాన్సెర్ట్ పేరుతో భారీ టూర్ సక్సెసైంది. గానగంధర్వుడు బాలసుబ్రమణ్యం సంగీత దర్శకుడు, మెలోడీ బ్రహ్మ మణిశర్మ, సుస్వరాల కీ.శే.చక్రి సైతం ఈ తరహా భారీ కార్యక్రమాల్ని పెద్ద సక్సెస్ చేశారు. వాటితో గాయనీగాయకులకు బోలెడంత ఉపాధి దొరికింది.

ప్రస్తుతం ఎం.ఎం.కీరవాణి.. మిక్కీ .జె.మేయర్ వంటి సంగీత దర్శకులు విదేశీ కాన్సెర్టులకు ప్లాన్ చేశారు. ఎంఎం కీరవాణి అమెరికా బే ఏరియా శాన్ జోస్ సెంటర్ లో జూన్ 1న లైవ్ కాన్సెర్టుని ప్లాన్ చేశారు. జూన్ 1 జూన్ 22, 23 తేదీల్లో బే ఏరియాలో కాన్సెర్టులు జరగనున్నాయి. . మరో వైపు మిక్కీ.జె.మేయర్ లైవ్ కాన్సెర్టు ఉత్తర అమెరికాలో జరగనుంది. మిక్కీ.జె తొలి కాన్సెర్టు కోసం మెజెస్టిక్ సిటీ నేషనల్ సివిక్ సెంటర్ (శాన్ జోస్)లో లైవ్ షో కోసం జూన్ 29వ తేదీని లాక్ చేశారు. రమ్య బెహరా, అంజనా సౌమ్య సహా టాప్ సింగర్లు ఈ ఈవెంట్ లో ఆలపించనున్నారు. ఇక ఇలాంటి ఈవెంట్లలో గీతా మాధురి.. సునీత రేంజు సింగర్లు అయితే భారీ మొత్తాల్ని అందుకుంటున్నారు. రన్నింగ్ సక్సెస్ ని బట్టి సింగర్లకు ప్రతిదానికి ఇంత అని పారితోషికం ఉంటుంది. ఇటీవల సింగర్లు.. మ్యూజిక్ డైరెక్టర్ల ను కాపీ రైట్ యాక్ట్ పరిధిలోకి తెచ్చారని చెప్పవచ్చు.