Movies

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటలు ఎలా విడిపోయాయో చూడండి

సినిమాల్లో నటన వేరు,నిజ జీవితం వేరు. ప్రేమించి పెళ్లి చేసుకుని సజావుగా జీవనం సాగించేవారూ ఉన్నారు. అలాగే కొన్నాళ్లకే విడాకుల వైపు అడుగులు వేసేవాళ్ళూ ఉన్నారు. బాలీవుడ్ లో ఇలాంటివి చాలా ఎక్కువే. అయితే ఇప్పుడు మనం అలా విడిపోయిన కొన్ని జంటల కథలోకి వెళదాం. సౌత్ ఇండియా సూపర్ స్టార్ కమల్ హాసన్ పెద్దలు కుదిర్చిన వాణీ గణపతిని పెళ్లి చేసుకున్నారు. పదేళ్ల తర్వాత వాణీకి విడాకులిచ్చి సారికను పెళ్లాడాడు. ఆమెతో శృతి, అక్షర హాసన్ లను కన్నాడు. తర్వాత ఆమెకు విడాకులిచ్చి గౌతమితో సహజీవనం చేసాడు. నిజానికి సందీప్ భాటీయా తో పెళ్లవ్వడం, సుబ్బలక్ష్మి అనే అమ్మాయికి జన్మనివ్వడం,అతడితో విడిపోయి, 2005నుంచి 2018వరకు కమల్ తో సహజీవనం చేసింది. తర్వాత ఎందుకో విడిపోయారు. ఇక మన్మధుడు నాగార్జునకు మొదట్లో డాక్టర్ రామానాయుడు కూతురు లక్ష్మితో పెళ్లయింది. నాగచైతన్య పుట్టాక వీళ్ళద్దరు విడాకులు తీసుకున్నారు. నటి అమలను పెళ్లాడాడు. వీళ్లకు అఖిల్ పుట్టాడు.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రాధిక మొదట్లో నటుడు,డైరెక్టర్ ప్రతాప్ పోతన్ పెళ్ళాడి, అతడితో విడాకులయ్యాక రిచర్డ్ ని పెళ్లిచేసుకుంది. అతడితో బిడ్డను కన్నాక, విభేదాలతో విడాకులిచ్చి నటుడు శరత్ కుమార్ ని పెళ్లాడింది. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్ మాత్రమే చదివినప్పటికీ ఎక్కువ జీవితాలను చదివిన అనుభవజ్ఞుడు. నందిని అనే వైజాగ్ అమ్మాయితో పెద్దలు కుదురిచ్చిన పెళ్లి అయింది. అయితే తర్వాత ఆమెకు విడాకులిచ్చి రేణుదేశాయ్ తో ప్రేమలో పడి,సహజీవనం చేసి,పెళ్లాడాడు. ఇద్దరు పిల్లలను కన్నాక, విడిపోయారు. తీన్ మార్ సినిమాలో నటించిన అన్నా లెజినావో అనే రష్యన్ యువతిని పెళ్ళిచేసుకుని ఒక కూతురు,ఒక కొడుకుని కన్నారు.

 కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మొదట రమలతను పెళ్లాడాడు. ముగ్గురు పిల్లలను కన్నాక స్టార్ హీరోయిన్ నయనతారతో ప్రేమలో పడ్డాడు. నయనతో పెళ్లి అవుతుందన్న ప్రచారంతో రమలత కు విడాకులిచ్చాడు. అయితే ప్రభుదేవాకు ఎందుకో నయన దూరం అయింది. అక్కినేని మనవడు సుమంత్ నటుడిగా గోదావరి ,సత్యం వంటి మూవీస్ తో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లిచేసుకున్నాడు. అయితే రెండేళ్లకే ఇద్దరికీ విడాకులయ్యాయి. అయితే కీర్తిరెడ్డి మరో పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.