Movies

ఈ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా…. మనకు ఎంతో ఇష్టమైన స్టార్ హీరో కొడుకు

సినిమాల్లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి,హీరోగా రాణించి,కామెడీ రోల్ తో కూడిన డిఫరెంట్ క్యారెక్టర్  ఆర్టిస్ట్ గా దూసుకెళ్లిన నటుడు శ్రీహరి అనగానే అందరికీ తెల్సిన హీరోగా  మదిలో మెదులుతాడు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా తన సత్తా చాటిన శ్రీహరి లివర్ కాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. డిస్కో శాంతిని పెళ్లాడిన శ్రీహరి సమాజ సేవలో ముందుంటూ ప్రజలకు సహాయ పడేవాడు. అతడు పోయినా మేడ్చల్ లో అతడి కూతురు పేరున ఇప్పటికీ ఎన్నో సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి. బతికుండగా ఒక హీరోగా కన్నా, ఓ మానవతావాదిగా సన్నిహితులు చూసేవారు. 

అడిగితె ఆపదలో ఆదుకునే గొప్ప గుణం శ్రీహరి సొంతం. ఆకలిగా ఉండేవాడికి అన్నం పెట్టె గొప్ప మారాజుగా శ్రీహరిని పలువురు కొనియాడుతారు. ఇక జర్నలిస్టులకు ప్రేమాభిమానం,గౌరవం అలానే ఉండేవి. అందుకే సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా శ్రీహరి రియల్ స్టార్ అనిపించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి,నాగార్జున,వెంకటేష్,బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కల్సి నటించిన శ్రీహరి తర్వాత తరం సాయి ధరమ్ తేజ్ తో కూడా కల్సి నటించాడు. 

ఇక శ్రీహరి,డిస్కో శాంతి లకు మేఘాంశ్, శశాంక్ అనే ఇద్దరు కొడుకులున్నారు. పెద్ద కుమారుడు మేఘాంశ్, హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యువతరం మెచ్చే రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాజ్ దూత్ అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. మానవత్వం మూర్తీభవించిన శ్రీహరి కొడుకు హీరో అవుతున్నాడని తెల్సి ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద స్టార్ హీరోగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు. కార్తీక్, అర్జున్ దర్శక ద్వయం తెరకెక్కించిన ఈ మూవీ షూటింగ్ ఇటీవల పూర్తయింది. త్వరలోనే ప్రమోషన్ వర్క్ కోసం ఈ సినిమా చిత్ర బృందం మీడియాను కలవబోతోంది.