Movies

సురేఖ వాణి రియల్ లైఫ్ స్టోరీ

సినిమాల్లో క్యారెక్టర్  ఆర్టిస్టుగా ,టివి యాంకర్ గా, హోస్ట్ గా ఇలా విభిన్న కోణాల్లో తన సత్తా చాటిన నటి సురేఖ వాణి విజయవాడలో పుట్టింది. పాఠశాల స్థాయినుంచి స్టేజ్ షో లలో యాక్టివ్ గా ఉండే ఈమె ఇంటర్ చదివేటప్పుడు కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో యాక్టివ్ గా ఉండేది. దీంతో టివిలో యాంకర్ గా, హోస్ట్ గా చేయాలనీ,ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని కోరిక ఏర్పడింది. హైదరాబాద్ వచ్చేయడంతో మా టాకీస్ ప్రోగ్రాం చేసే ఛాన్స్ దక్కించుకుకుని టివి పరిశ్రమలో సెటిల్ అయింది. ఆతర్వాత హార్ట్ బీట్ ప్రోగ్రాం తో మంచి యాంకర్ గా గుర్తింపు తెచ్చకుంది. ఇక మొగుడ్స్,పెళ్లామ్స్ షో చేసి, భారీ హిట్ కొట్టింది. కెరీర్ ని మలుపు తిప్పిన ఈ షోకి డైరెక్టర్ గా వ్యవహరించిన సురేష్ తో ప్రేమలో పడింది. సురేఖ,సురేష్ లిద్దరిదీ వేరు వేరు కులాలు కావడంతో ఇంట్లో ఒప్పుకోకపోయినా కెరీర్ మంచి స్థితిలో ఉన్నందున పెళ్ళిచేసుకుని ఒక్కటయ్యారు. 

అయితే అప్పట్లో ఆమె గుండు చేయించుకోవడం చర్చకు దారితీసింది. తమపెళ్లికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగితే గుండు చేయించుకుంటానని మొక్కుకుందట. మొక్కు తీర్చుకోవడంతో టీవీల్లో సినిమాల్లో పలు ఛాన్స్ లు కూడా మిస్సయింది. అయితే మళ్ళీ ఆమె కెరీర్ తరవాత ఊపందుకునే మంచి మంచి కార్యక్రమాలు చేసే ఛాన్స్ వచ్చింది. టీవీల్లో ప్రోగ్రామ్స్ తో పేరుతెచ్చకునే సమయంలోనే సినిమాల్లో కూడా మంచి ఛాన్స్ లు వచ్చాయి. చిన్న సినిమాలతో పాటు సూపర్ స్టార్ ల సినిమాలలో కూడా నటించిన సురేఖ క్యారెక్టర్  ఆర్టిస్టుగా బిజీగా మారింది. భద్ర, బొమ్మరిల్లు ,దుబాయ్ శ్రీను,రెడీ , ఉల్లాసంగా ఉత్సాహంగా,ఓయ్, ఎవరైనా ఎప్పుడైనా,నిర్ణయం,ఏం మాయ చేసావే,బెట్టింగ్ బంగార్రాజు, నమో వెంకటేశా,లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్,ప్రస్తానం, నాయక్,బాద్షా , దేనికైనా రెడీ,పవర్, పిల్లా నువ్వులేని జీవితం,బెంగాల్ టైగర్, ద్వారకా వంటి ఎన్నో హిట్ సినిమాల్లో చేసింది.

అయితే ఈమెపై ఎన్నో పుకార్లు షికారు చేసాయి. కొన్ని సినిమా ఫంక్షన్స్ కి అందంగా తయారై రావడం పుకార్లకు కారణంగా మారింది. కూతురుతో కల్సి చేసిన షాట్ డాన్స్ వైరల్ అవ్వటంతో విమర్శలకు కారణమైంది. యూట్యూబ్ నుంచి డిలీట్ చేయించడానికి ఆమె చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది . ఇక సోషల్ మీడియాలో చేసే పోస్టులు వివాదంగా మారుతుంటాయి. విమర్శలకు దూరంగా ఉంటూ కెరీర్ పీక్ స్టేజ్ కి చేరిన సమయంలో తనను అన్నివిధాలా ఎంకరేజ్ చేసిన భర్త మరణం ఆమెకు తీరని వేదన మిగిల్చింది.