Politics

ఆంధ్రప్రదేశ్ లో MP గా గెలిస్తే ఏమి పవర్స్ ఉంటాయో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్న భారతదేశంలో ప్రజాప్రతినిధులకు ఇచ్చే సౌకర్యాలు అప్ డేట్ అవుతూనే ఉన్నాయ్. ఇక పార్లమెంట్ సభ్యులకు అందించే సౌకర్యాలు చూస్తే ఔరా అనిపిస్తుంది. అన్ని సౌకర్యాలు దాదాపు ఉచితంగానే అందుతాయి. ఒక్కో ఎంపీకి నెలకు లక్ష రూపాయలు మూల వేతనం దక్కుతుంది. నియోజక వర్గ అలవెన్స్ కింద 45వేలు,కార్యాలయ సిబ్బందికోసం మరో 45వేలు అందుతాయి. ఆఫీస్ కి ఇచ్చే 45వేలలో15వేలు స్టేషనరీ,మిగిన 30వేలు పిఏలకు ఖర్చు చేయాలి. ఇక ఎపి,తెలంగాణా ప్రభుత్వాలు అయితే తమ రాష్ట్రాల ఎంపీలకు ప్రతినెలా 50వేలు భద్రతా భత్యం కింద అందజేస్తున్నాయి. ఢిల్లీలో ఉచిత నివాసం, 50వేల యూనిట్స్ విద్యుత్, నాలుగు వేల కిలో లీటర్ల నీళ్లు,వైద్య సౌకర్యం కూడా ఎంపీలకు పార్లమెంట్ సమకూరుస్తుంది. ఏడాదిలోగా విద్యుత్ వాడుకోకపోతే మరుసటి ఏడాది అదనంగా వాడుకోవచ్చు. ఉచితంగా విమానయాన,నౌకాయాన,రైల్వే సౌకర్యాలు లభిస్తాయి. ప్రతియేటా 34విమాన టికెట్స్ ఇస్తారు. దేశంలో ఏ ప్రాంతానికైనా కైనా వెళ్ళవచ్చు.

ఎంపీ జీవిత భాగస్వామికి 8విమాన టికెట్స్ ఉచితంగా యిస్తారు. ఈ ఏడాది ఇచ్చిన టికెట్స్ వాడుకోలేక పొతే మళ్ళీ ఏడాది ఆమేరకు అదనంగా వాడుకోవచ్చు. ఇక ఎంపీతో పాటు జీవిత భాగస్వామికి కూడా రైల్ ప్రయాణం ఉచితమే. ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఏ తరగతిలోనైనా ప్రయాణించవచ్చు. ఇక వ్యక్తిగత సహాయకుడికి 2ఏసీ రైల్ పాస్ ఇస్తారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు వచ్చీ వెళ్ళడానికి రెండు టికెట్స్ ఇస్తారు. స్థాయి సంఘ సమావేశాలకు వచ్చీ వెళ్ళడానికి ఉచిత విమాన టికెట్ ఇస్తారు. ఇక చూపు సరిగ్గా లేని వాళ్ళు తమతో ఒక సహాయకుడిని తమతో ఉచితంగా విమానంలో గానీ,రైల్లో గానీ తీసుకెళ్లవచ్చు. అంగవైకల్యం ఉంటె కూడా ఇలాంటి సహాయం వస్తుంది. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ లో అంగవైకల్యం దృవీకరించి సర్టిఫికెట్ ఇస్తారు. 

అండమార్ నికోబర్ దీవుల నుంచి వచ్చే ఎంపీలకు స్టీమర్ పాస్ కూడా ఇస్తారు. కొత్తగా వచ్చే ఎంపీలకు ఢిల్లీలో హోటల్స్ ,గెస్ట్ హౌస్ లలో సౌకర్యం తాత్కాలికంగా కల్పిస్తారు. ఎంపీలకు ఉచిత ఫోన్ సౌకర్యం కల్పిస్తారు. ఏటా 50వేల లోకల్ కాల్స్ ఉచితంగా అందిస్తారు. అంతేకాకుండా తాను ఎంచుకున్న ప్రదేశంలో గానీ కార్యాలయంలో గానీ ఫోన్ పెట్టుకుంటే 50వేల ఉచిత లోకల్ కాల్స్ ఇస్తారు. బిఎస్ ఎన్ ఎల్ కవరేజ్ లేని చోట ప్రయివేట్ ఫోన్ వినియోగించుకోవచ్చు. మొత్తం మూడు ఫోన్స్ కి ఒక లక్షా 50వేల లోకల్స్ తో పాటు,ఒకదానికి బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ ఇస్తారు.

ఇక ఇంట్లో వాళ్లకు కేంద్ర వైద్య పధకం వర్తిస్తుంది. ఎంపీ అనుభవాన్ని బట్టి బంగ్లా పెద్దది గానీ అపార్ట్మెంట్ తరహా ఇల్లు గానీ ఇస్తారు. ఒక వేళ ఎంపీ చనిపోతే ఆరుమాసాలపాటు ఆ ఇంట్లో ఉండవచ్చు. ఇక ఎన్నికల్లో ఓడిపోతే నెల్లాళ్ళ లోపు ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇక మాజీ ఎంపీలు ఒక్కక్కరికి నెలకు 20వేల పెన్షన్ వస్తుంది. అయితే వాళ్లకి వేరే రకాల పెన్షన్స్ వస్తున్నా సరే ఎంపీ పెన్షన్ తప్పనిసరిగా ఇస్తారు. ఇక ఏడాది కి 1500అదనపు పెన్షన్ కూడా ఇస్తారు. మాజీ ఎంపీ చనిపోతే అతడిపై ఆధారపడిన వాళ్లకు పెన్షన్ లో 50శాతం లభిస్తుంది.