Politics

జగన్ గెలుపు గురించి ఎల్లో మీడియా చెపుతున్న కారణాలు ఇవే ?

ఇన్నాళ్లూ టిడిపి ని సమర్ధిస్తూ వస్తున్న పార్టీ శ్రేణులతో పాటు సమర్ధించే మీడియా కూడా జగన్ విజయం చూసి ఖంగుతిన్నారు. ఇంత దారుణంగా ఓడిపోయామా అని బిక్కచచ్చిపోతున్నారు. ఓటమి అంతుబట్టడం లేదు. అయితే ఎల్లో మీడియా ఇందుకు గల కారణాలను వెల్లడిస్తోంది. జగన్ పాదయాత్ర, నవరత్నాలు,ప్రత్యేక హోదా పై పోరాటం,చంద్రబాబు ప్రభుత్వంపై గల వ్యతిరేకత, మహిళల ఆదరణ,రైతుల ఆదరణ,టిడిపి నుంచి వచ్చిన వలసలు,మార్పు,ఒకేఒక్క ఛాన్స్ , ప్రశాంత్ కిషోర్ వ్యూహ రచన ఇవన్నీ జగన్ గెలుపునకు కారణంగా విశ్లేషిస్తున్నారు. జగన్ పై జనంలో గల సానుభూతి కారణంగా ఒక ఛాన్స్ ఇచ్చి,మార్పు చూద్దాం అనే భావన జనంలో వచ్చింది. ఇక పార్టీని క్షేత్ర స్థాయి నుంచి అధ్యయనం చేసి,ప్రశాంత్ కిషోర్ వ్యూహం ప్రకారం వెళ్లడం వైసిపికి కలిసి వచ్చింది. 

ప్రశాంత్ కిషోర్ చెప్పింది చెప్పినట్లు జగన్ చేయడమే కాదు,ఆమేరకు టికెట్స్ కేటాయించారు. పాదయాత్ర తీసుకుంటే, ఇప్పటివరకూ పాదయాత్ర చేసి ఫెయిల్ అయిన నాయకుడు అంటూ లేరని చెప్పాలి. 2004లో డాక్టార్ వైఎస్,2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి అంతకుముందు వాళ్ళు చేసిన పాదయాత్రలో కారణం. ఇక జగన్ 13జిల్లాల్లో 341రోజుల పాటు 3648కిలోమీటర్ల పాదయాత్ర జగన్ పూర్తిచేసాడు. ఇది పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. వైసిపి ప్రకటించిన నవరత్నాలు ప్రజలను ఆకర్షించాయి. రైతు భరోసా,ఆరోగ్య శ్రీ,యువతకు ఉపాధి,ఫీజు రీ  ఎంబర్స్ మెంట్ ,అమ్మవడి,పింఛన్ల పెంపు ,వైస్సార్ ఆసరా,బిసి సంక్షేమం,వైస్సార్ గృహ నిర్మాణం,మద్యపాన నిషేధం ఇలా నవరత్నాలతో పాటు ప్రత్యేక హోదా విషయంలో జగన్ మాట మార్చని నైజం ప్రజలను ఆకర్షించింది. 

పార్లమెంట్ లోపలా వెలుపలా వైసిపి ప్రత్యేక హోదాపై పోరాటం చేసింది. జిల్లాల వారీగా సభలు నిర్వహిస్తూ, మొదటి నుంచి ఒకే వైఖరితో ఉంది. చంద్రబాబు పాలనా, అధికారపార్టీపై ఉండే అసంతృప్తి ని వైసిపి తనకు అనుకూలంగా మలచుకుంది. ప్రచార ఆర్భాటాలే టీడీపీని దెబ్బతీశాయని ఆపార్టీ నేతలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. జన్మభూమి కమిటీలపై గల వ్యతిరేకత వైసిపికి కల్సి వచ్చింది. పసుపు కుంకుమకు ధీటుగా ఏడాదికి 15వేలు చొప్పున ఐదేళ్లలో 75వేలు ఇస్తామని, ఎన్నికల నాటికీ గల రుణాలను మాఫీ చేస్తామని వైసిపి చెప్పడంతో మహిళలను ఆకర్షించింది.

ఏటా 12న్నరవేల చొప్పున రైతుకి పెట్టుబడి నిమిత్తం ఖాతాలో జమచేస్తామని చెప్పడం రైతులను ఆకర్షించింది. ఒక్కో రైతుకి ఐదేళ్లలో 50వేలు లబ్ది చేకూరేలా హామీ మేనిఫెస్టోలో పెట్టారు. ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వలసలను ప్రోత్సహించిన వైసిపి జిల్లాల వారీగా సామాజిక వర్గాలు,కీలక నేతలను పార్టీలో చేర్చుకున్నారు. అవంతి శ్రీనివాస్,తోట నరసింహం,పండుల రవీంద్ర బాబు,సినీ నటుడు అలీ,ఆదాల ప్రభాకర రెడ్డి,ఆమంచి కృష్ణమోహన్,మాగుంట శ్రీనివాసుల రెడ్డి,ఇలా వీళ్లంతా ప్లస్ అయ్యారు.