Movies

శివ శక్తి దత్త అనే వ్యక్తి ఎవరు? రాజమౌళి కుటుంబం ఇలా ఉండటానికి కారణం….?

అటు తమిళం,ఇటు తెలుగులో కూడా ఏ డైరెక్టర్ కి లేనివిధంగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కి విజయేంద్ర ప్రసాద్ ఒక ఆయుధంలా ఉన్నారు. తండ్రి కథ రాస్తే దాన్ని తన చేతుల్లోకి తీసుకుని జక్కన్న తెరకెక్కించి విజయ బావుటా ఎగరేస్తున్నాడు. పూరి జగన్నాధ్,వివి వినాయక్, సుకుమార్, తమిళ డైరెక్టర్ శంకర్, మణిరత్నం ఇలా ఎందరో దిగ్గజ దర్శకులకు కూడా విజయేంద్ర ప్రసాద్ లాంటి రైటర్ ఇంట్లో లేడు. రెండు కథలను కలిపి ఒక కథగా మలచగల సత్తా ఉన్న దర్శకుడు విజయేంద్రప్రసాద్. స్టూడెంట్ నెంబర్ వన్ మొదలుకుని బాహుబలి వరకూ అలాగే ప్రస్తుతం తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ వరకూ అన్నీ ఆయన చేతులమీదుగానే జక్కన్నకు చేరతాయి. అప్పుడు అవుట్ డోర్ విజయంగా మారుతున్నాయి.

అయితే జక్కన్న, విజయేంద్ర ప్రసాద్ లకు ఇంతటి పేరు రావడానికి మరో కీలక వ్య్తకి కూడా ఉన్నారు. ఆయనే శివశక్తి దత్తా. విజయేంద్ర ప్రసాద్ కి అన్నయ్య ఈయన. శివశక్తి దత్తా లేకుంటే విజయేంద్ర ప్రసాద్ లేడు. ఈయన లేనిదే జక్కన్న,కీరవాణి,కళ్యాణ్ మాలిక్,ఎం ఎం శ్రీలేఖ,రమా రాజమౌళి వీళ్ళందరూ లేనట్టే. చిన్నప్పుడు నలదమయంతి మూవీ చూసిన దత్తా ఎలాగైనా సినిమా పరిశ్రమలో రాణించాలని పట్టుదలతో తండ్రితో గొడవపడి మరీ ముంబయి వెళ్లారు. అక్కడ నుంచి మద్రాస్ వచ్చి మూడు నాలుగు సినిమాల్లో నటించారు. రచయితగా, గేయ రచయితగా, దర్శకుడిగా పేరుపొందారు. ఇక ఎవరి దగ్గరా నేర్చుకోకుండానే సితారా,వయోలిన్ మీద దత్తా పట్టు సాధించారు. చిన్నప్పుడు దత్తా చిటికెన వేలు పట్టుకుని సినిమాల షూటింగ్స్ కి విజయేంద్ర ప్రసాద్ వెళ్లేవారు.

అన్నయ్య కథ చెబుతుంటే ఎంతోఆసక్తిగా వినేవాడు.  ఎల్వి ప్రసాద్ దగ్గర చేర్చి అన్నయ డైరెక్టర్ గా సినిమా తీయడానికి తమ్ముళ్ళంతా డబ్బు పోగేశారట. అయితే సగం సినిమాయే వచ్చిందట. ఈయన రేంజ్ ని ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయేవారు. అలాగని దత్తా తన స్థాయిని దిగేవారు కాదు. నాగార్జున నటించిన షిర్డీ సాయి మహత్యం సినిమాలో అమరామరా, రాజన్నలోని అమ్మా అవని పాటలను రాసింది ఈయనే. బాహుబలి మూవీలో మమతల తల్లి పాట కూడా ఆయనే రాసారు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో ఘనకీర్తి సాంధ్ర గీతం కూడా ఆయన రాసిందే. ఈయనలోని రచయిత కోణాన్ని విజయేంద్ర ప్రసాద్,కాంచి అందిపుచ్చుకోగా,దర్శకత్వ ప్రతిభ రాజమౌళి కి అబ్బింది. సంగీత పరిజ్ఞానం కీరవాణి,కళ్యాణ్ మాలిక్,ఎం ఎం శ్రీలేఖ లు అందుకున్నారు.