Movies

టివి షోలో విజయ్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే

టీవీ ఆర్టిస్టులతో మహోత్సవం అంటే అడ్డూ ఆపూ ఉండదని టాక్. అందుకే బుల్లితెర అవార్డులు, వార్షికోత్సవ వేడుకలు మామూలుగా రేంజ్ లో ఉండవు. ఇక ఇప్పుడున్న తెలుగు ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లు అనునిత్యం టీఆర్ పీల కోసం ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం నిరంతరం చేస్తూనే ఉంటున్నాయి. ముఖ్యంగా ఆదివారాల్లో జనాల్ని తమ టీవీలకు అతుక్కుపోయేలా చేసేందుకు చానెల్ కార్యక్రమాల రూపకర్తలు వేస్తున్న ఎత్తుగడలు క్రియేటివ్ గా ఉంటున్నాయని అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే, తెర నిండుగా అందాలు ఒలికిస్తూ, కలర్ ఫుల్ గా ఫ్రేము కనిపిస్తే చాలు టీఆర్ పీ దానంతట అదే అమాంతం పెరిగిపోతుంది. ఈ ఫార్ములా మన బుల్లితెర క్రియేటర్స్ బానే కనిపెట్టారు. బోయపాటి ఫ్రేములా కలర్ ఫుల్ గా తెరనిండుగాప్రతిదీ పేర్చడం లో దిట్టాలుగా అయ్యారు.

టీవీ సీరియళ్లలో నటించే ఆర్టిస్టులతో డ్యాన్సులు చేయించడం, ఆటాపాటా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం దానికి సినీగ్లామర్ జతచేసి, జనాల్ని టీవీలకు అతుక్కుపోయే టెక్నిక్ ప్లే చేయడం వంటి హంగులు అద్దుతున్నారు. దీంట్లో డ్యాన్సర్లు ఓవైపు సీరియల్ నటులతో డ్యాన్సులు చేస్తూ ఫ్రేమ్ లో బిగి సడలకుండా చేస్తుంటారు. యాంకర్లు, హోస్టులు రక్తి కట్టించే కామెడీ పండించడం షరా మామూలే. సరిగ్గా ఈ ఆదివారం సాయంత్రం జీతెలుగు చానెల్లో అలాంటి ప్రోగ్రాం ఒకరి ప్రసారం అయింది. `జీ మహోత్సవం 2019` పేరుతో ఘనంగానే నిర్వహించిన ఈ షోకి ప్రదీప్ మాచిరాజు.. శ్రీముఖి, యాంకర్ రవి వంటి వాళ్లు హైప్ తెచ్చారు. 

అసలు విషయం ఏమిటంటే, ఈ వేదికపై గీత- గోవిందం కలిసి వచ్చి విజయ్ దేవరకొండ అదిరిపోయే ట్రీట్ మెంట్ ఇచ్చాడని చెప్పుకోవాలి. ఆ ఇద్దరూ వేదికపైకి దూసుకొచ్చిన తీరు అంతే ఇంప్రెస్సివ్ గా ఉంది. ఇక ఇక్కడ షో ఇచ్చినందుకు విజయ్ దేవరకొండ ఏకంగా కోటిన్నర పారితోషికం అందుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతి టీవీ కార్యక్రమానికి స్టార్లకు పారితోషికాలుంటాయి. పిలిస్తే వచ్చే వీలు కల్పించుకునేలా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. జీ ఆఫర్ కూడా అలాంటిదేనని అంటున్నారు. ప్రస్తుతం యూత్ లో రౌడీ హవాతో పాటు గీత రష్మిక హవా కూడా నడుస్తోంది. మరి గీతకు ఎంత ఇచ్చారో తెలీదు. ఆ ఇద్దరి రాకతో టీవీ సీరియల్ కార్యక్రమం కలర్ ఫుల్ గా మారిపోయి, ఏకబిగిన చానెల్ కి రేటింగ్ కి అదిరిపోయిందట. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి క్రియేటివ్ ప్రోగ్రామ్స్ తో సందడి చేస్తారో చూడాలి.