మకాం మార్చేస్తున్న పవన్ కళ్యాణ్..షాకింగ్ నిర్ణయం తీసుకున్న పవన్
గాజువాక భీమవరం నియోజికవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయినా తాను రాజకీయాలలోనే కొనసాగుతాను అంటూ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పడు ఆంధ్రప్రజలకు తనపై నమ్మకం కలిగించు కోవడానికి భీమవరంకు మకాం మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య జరిగిన ఎన్నికలలో గాజువాక నుండి పోటీ చేసిన పవన్ అక్కడ ప్రజలకు నమ్మకం కలిగించడానికి గాజువాకలో ఇల్లు అద్దెకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఎన్నికలలో రెండు చోట్ల అనూహ్య పరాజయం చూసినప్పటికీ పవన్ కళ్యాణ్ తిరిగి భీమవరంలోనే మళ్లీ పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. భీమవరంలో ఓడినా అక్కడే సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుని స్థానికుడుని అన్న ఫీలింగ్ తెచ్చుకోవాలని పవన్ ఆలోచిస్తున్నాడట. మెగా బ్రదర్స్ సొంత ఊరు మొగల్తూరు అయిన నేపధ్యంలో తమ సొంత ఊరికి దగ్గర ప్రాంతమైన భీమవరం తనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని భావిస్తూ పవన్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ నెలకు 15 రోజులు భీవరంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటాడట. వాస్తవానికి దశాబ్దం క్రితం జరిగిన ఎన్నికలలో చిరంజీవి పాలకొల్లులో ఓడిపోతే లేటెస్ట్ గా జరిగిన ఎన్నికలలో నాగబాబు నరసాపురం నుండి పవన్ భీమవరం నుండి ఓడిపోయినా తిరిగి అదే పశ్చమ గోదావరి జిల్లాను తన భవిష్యత్ రాజకీయాలకు కేంద్రంగా మార్చుకోబోతు ఉండటం సంచలనంగా మారింది.
ఇప్పటికే హైదరాబాదు నుండి అమరావతి ప్రాంతంలో ఒక సొంత ఇల్లు కట్టుకున్న పవన్ ఇప్పుడు భీమవరంలో తన మూడవ ఇంటి కోసం ప్రయత్నాలు ప్రారంభించడం షాకింగ్ న్యూస్ గా మారింది. పవన్ పుట్టిన సొంత ప్రాంతానికి ఇప్పటి వరకు ఏమి చేయలేదు అని విమర్శలు వస్తున్న నేపధ్యంలో రాబోతున్న 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పవన్ తన వ్యూహాలు అమలు పరుస్తున్నాడనుకోవాలి..