సినీ వారసుల్లో తమ్ముళ్ల హవా… ఎలా ఉందో చూడండి
సినీ ఇండస్ట్రీ అనేది వారసుల సొత్తు గా మారిపోతూ వస్తోంది. ఎందుకంటే, నటీ నటుల కొడుకులు, కూతుళ్లు, తమ్ముళ్లు, చెల్లుళ్ళు ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. అయితే కొంతమంది సక్సెస్ అయితే.. మరికొందరు ఫేడ్ అవుట్ అవుతారు. ఒకప్పుడు బాలీవుడ్ లో నటవారసులు ఎక్కువగా కనిపించేవారు. కానీ ఇప్పుడు ఏ చిత్రపరిశ్రమ చూసినా వారసుల సందడి కనిపిస్తోంది.
ప్రస్తుతం కొందరు హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో ఏళ్ళు కానప్పటికీ.. వాళ్ళు ఇంకా నిలదొక్కుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వారి తమ్ముళ్లను కూడా రంగంలోకి దించేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ హవా బాగా కనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే, సెన్సషనల్ హీరో, యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ను పరిచయం చేస్తున్నాడు. ఆనంద్ దేవరకొండ సరసన హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హీరోయిన్ గా పరిచయం కానుంది.
నూతన దర్శకుడు కె.వి.ఆర్.మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ‘దొరసాని’ అనే టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఈ ఏడాదిలోనే టాలీవుడ్‌కి హీరోగా పరిచయం కానున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ చిత్రంతో మోనికా శర్మ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్ దాసరి లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడైన బెల్లంకొండ గణేష్ బాబు ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అవుతున్నాడు. బెల్లంకొండ గణేష్ బాబు, ఇప్పటివరకు తెరవెనుక తండ్రి బెల్లంకొండ సురేష్ తో కలసి అనేక చిత్రాలు నిర్మించాడు. ఇప్పుడు తెరముందుకు రాబోతున్నాడు.
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఫణి డైరక్ట్ చేస్తున్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వైష్ణవ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా, ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఆడియన్స్ ముందుకి రానుంది.