Politics

వేదిక మీద జగన్ చేతికి పెట్టుకున్న వాచ్ గురించి కొన్ని విషయాలు

అశేష జనవాహిని నడుమ విజయవాడలో ఎపి నూతన సీఎం గా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి కావాలన్న కలను సాకారం చేసుకుని,అభిమానులు,ప్రజలు ,కుటుంబ సభ్యుల నడుమ ప్రమాణం చేసారు. జీపులో సభాస్థలికి ఎంట్రీ ఇస్తూ అందరికి అభివాదం చేస్తూ, సరిగ్గా 12.10గంటలకు వేదిక వద్దకు చేరుకున్న జగన్ చేత 12.23గంటలకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ కె ఎల్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. 

జగన్ ప్రమాణ స్వీకారం చూస్తే,2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రమాణ స్వీకారాన్ని గుర్తుచేసింది. ప్రజలకు రెండు చేతులు జోడించి అభివాదం చేసినపుడు కొన్ని ఆసక్తి కరమైన అంశాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా ఎప్పుడూ చేతికి వాచి పెట్టని జగన్ ఆరోజు వాచీ పెట్టడం చర్చకు దారితీసింది. 

జగన్ పెట్టుకున్న వాచీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఆ వాచీ ఎవరిదని కనుక్కుంటే,అది డాక్టర్ వైఎస్ రాజశేఖరుని వాచీ అని,తొలిసారి గా జగన్ పెట్టుకుని వచ్చారని తెలిసింది. తండ్రి వాచీ పెట్టుకుని రావడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి ఈ వాచీ వెనుక గల కారణం,సెంటిమెంట్ ఏమిటో జగన్ కే తెలియాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.