Movies

శ్రీదేవి నుంచి రకుల్ వరకు తండ్రి కొడుకుల సరసన నటించిన హీరోయిన్స్

సినిమా పరిశ్రమలో ఎన్నో వింతలూ విచిత్రాలు జరుగుతుంటాయి. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా గట్టిగా పదేళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కువడం కష్టం. అలాంటిది తండ్రీ కొడుకుల సరసన నటించడం అంటే మామూలు విషయం కాదు. అందాల నటి శ్రీదేవి అప్పట్లో అక్కినేనితో ప్రేమాభిషేకం, శ్రీరంగ నీతులు,ముద్దుల కొడుకు వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించి,తర్వాత కాలంలో నాగార్జునతో ఆఖరి పోరాటం,గోవిందా గోవిందా వంటి చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ లో కూడా ధర్మేంద్ర,ఆయన తనయుడు సన్నీ డియోల్ సరసన కూడా శ్రీదేవి నటించి మెప్పించింది. ధర్మేంద్ర,సన్నీ డియోల్ సరసన కూడా జయప్రద నటించింది. అమితాబ్ సరసన నటించిన శిల్పాశెట్టి ఆతర్వాత అభిషేక్ బచ్చన్ తో జోడీ కట్టింది. 

ఇక ఎన్టీఆర్ సరసన నాలుగైదు సినిమాల్లో నటించిన రతి అగ్నిహోత్రి ఆతరువాత బాలయ్య సరసన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో నటించింది. అలాగే ఎన్టీఆర్ తో ఎన్నో చిత్రాల్లో నటించిన జయసుధ చాలా గ్యాప్ తర్వాత బాలయ్య సరసన అధినాయకుడు మూవీలో నటించింది. అలాగే చండశాసనుడు మూవీలో ఎన్టీఆర్ తో కల్సి నటించిన రాధ ఆతర్వాత బాలయ్యతో కల్సి రాముడు భీముడు,ముద్దుల క్రిష్నయ్య,వంటి ఎన్నో చిత్రాల్లో నటించింది. అలాగే అక్కినేని సరసన గోపాల కృష్ణుడు వంటి చిత్రాల్లో నటించిన రాధ ఆతర్వాత విక్కీ దాదా సినిమాలో నాగ్ తో కల్సి నటించింది. తమిళంలో కూడా శివాజీ గణేశన్,అయన తనయుడు ప్రభు ల సరసన రాధ నటించింది. సూపర్ స్టార్ కృష్ణ సరసన గూఢచారి117మూవీలో నటించిన భానుప్రియ ఆతర్వాత కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు సరసన బ్లాక్ టైగర్ మూవీలో నటించింది. 

అలాగే నటి గౌతమి కూడా కృష్ణ సరసన డియర్ బ్రదర్ మూవీలో నటించి, రమేష్ బాబు తో కల్సి కృష్ణగారి అబ్బాయ్ ,బజార్ రౌడీ మూవీస్ జోడి కట్టింది. అదేవిధంగా హీరోయిన్ రంభ రౌడీ అన్నయ్య సినిమాలో కృష్ణతో జోడీ కట్టి,రమేష్ బాబుతో పచ్చతోరణం మూవీలో జత కట్టింది. కాగా నటి ఆమని కూడా పచ్చని సంసారం మూవీలో హీరోయిన్ గా చేసి, రమేష్ బాబుతో కల్సి అన్నాచెల్లెళ్లు మూవీలో హీరోయిన్ గా వేసింది. ఇక ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మగధీర మూవీలో రామ్ చరణ్ తో జతకట్టి, ఆతర్వాత నాయక్,గోవిందుడు అందరి వాడేలే వంటి సినిమాల్లో జోడీ కట్టింది. తరువాత చెర్రీ తండ్రి మెగాస్టార్ చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150 మూవీలో నటించి మెప్పించింది. నాగ చైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం మూవీలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు నాగార్జున సరసన మన్మధుడు 2లో నటిస్తోంది. కాగా నాగ్ సరసన సోగ్గాడే చిన్ని నాయనే సినిమాలో జతకట్టిన లావణ్య త్రిపాఠి ఆతర్వాత నాగచైతన్యతో కల్సి యుద్ధం శరణం మూవీలో హీరోయిన్ గా చేసింది.