Politics

జగన్ CM అయ్యారు కానీ – ముందు ఎన్ని సవాళ్లు ఉన్నాయో….???

ఇల్లలకగానే పండగ కాదని అంటారు. సరిగ్గా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర నవ నూతన సీఎం వై ఎస్ జగన్ పరిస్థితి అలానే ఉందంటున్నారు . ఎన్నో ఆశలతో ప్రజలు అధికారం అప్పగించారు. కానీ రాష్ట్ర ఆర్ధిక స్థితి అత్యంత దయనీయంగా ఉంది. అందుకే రానున్న రోజుల్లో పాలన ఏ విధంగా చేస్తారో అన్నది పెను సవాల్ గా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.అయితే జగన్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చాలానే హామీలు ఇచ్చేసారు.అవన్నీ ఎలా నెరవేరుస్తారా అని ఒక పక్క వైసీపీ శ్రేణులు మరో పక్క ఏమన్నా తేడా జరిగితే విమర్శలకు దిగడానికి ఇతర పార్టీ శ్రేణులు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఇవి అమలు చేయాలంటే జగన్ పై మరింత భారం పడుతుంది.

జగన్ మూడు దశల్లో అసలు రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని చేస్తానని హామీ ఇచ్చేసారు. ఈ హామీ వల్ల పార్టీకు భారీ నష్టం తప్పేలా లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది చెప్పినంత సులభంగా ఆచరణ సాధ్యం కాదు.ఎందుకంటే మద్యం అనేది దశలు వారీగా నిషేధం చేసినా సరే దాని వల్ల రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ తగ్గుతుంది తప్ప ఒరిగేది ఏమీ లేదని అంటున్నారు.ఇదొక్క రత్నమే అనుకుంటే ముందు కొద్దీ కొద్దిగా తగ్గించుకుంటూ వెళ్తున్నారు అనుకుందాం కానీ మరో పక్క జగన్ చెప్పిన పింఛను అంకెలు పెరిగిపోతాయి.

ఈలెక్కన అక్కడ అదనపు భారం తప్పదు. ఓ పక్క రాష్ట్రానికి రెవెన్యూ తగ్గిపోతుంది దీనితో రాబోయే రోజుల్లో జగన్ కు గడ్డు కాలం తప్పదని చెప్పాలి.ఇక జగన్ అనేక రకాల హామీలను కూడా ఇచ్చేసారు. అవన్నీ అధిక మొత్తంలో డబ్బులతో కూడుకున్నవే. మరి వీటిని అమలు చేయడానికి అసలు జగన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు?ఇప్పటికీ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఇలా లాభాల బాట పట్టించడం చాలా కష్టం. ఈసమయంలో ఆదాయ వనరులొచ్చే వాటిని వదిలేస్తే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు. చూస్తేనే అన్నీ పెద్ద సవాళ్ళే ఉన్నాయని, వాటన్నిటిని జగన్ ఎలా అధిగమిస్తారో చూడాలని రాజకీయ పండితులు అంటున్నారు.