అష్టా చెమ్మా సీరియల్ హీరోయిన్ చైత్ర బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?
కన్నడ సీరియల్స్ నటిస్తూ తెలుగు సీరియల్స్ లో కూడా చైత్ర రాయ్ ఛాన్స్ లు దక్కించుకుంది. స్టార్ మాలో ప్రసారం అయిన అష్టా చెమ్మా సీరియల్ హీరోయిన్ చైత్ర రాయ్ తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయింది. పేరుకి కన్నడ అమ్మాయి అయినా తెలుగు అమ్మాయిలా కనిపించడంతో ఆ సీరియల్ తోనే స్టార్ డమ్ తెచ్చేసుకుంది. డ్యూయెల్ రోల్స్ వేయడం అంటే ఈమెకు చాలా ఇష్టమట. అలాంటి ఛాన్స్ వస్తే బాగుండును అని కోరుకున్నట్టుగానే అక్కా చెల్లెల్లు సీరియల్ లో డ్యూయెల్ రోల్ వచ్చింది. ఈ సీరియల్ లో నెగిటివ్,పాజిటివ్ రోల్స్ చేయడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆమె చెబుతోంది.
సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం తెలుగు టివి రంగానికి వచ్చి మంచి పేరు దక్కించుకున్న చైత్ర అష్టా చెమ్మా సీరియల్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ తో బెస్ట్ హీరోయిన్ అవార్డు కొట్టేసింది. ఈ సీరియల్ లో ఎక్కువగా ఏడ్చేసే క్యారెక్టర్ కనుక నేను ఏడుస్తుంటే అభిమానులు కూడా చాలా బాధ పడుతూ కంట తడి పెట్టేవారని చెప్పింది. అయితే ఈ సీరియల్ లో అందరూ నవ్వుతూ ఉండే క్యారెక్టర్స్ చేస్తే తాను ఏడ్చే క్యారెక్టర్ చేయడం వలన కొంచెం బాధ అనిపించేదని తెల్పింది. అలాగే వారి వారి క్యారెక్టర్ ని బట్టి రిచ్ గా రెడీ అయితే తాను మాత్రం క్యారెక్టర్ ని బట్టి పూర్ గా రెడీ అయ్యేదాన్ని అని చెప్పింది.
నిజానికి వాళ్ళు రిచ్ గా తయ్యారవుంటే బాధగా ఉన్నా, వాళ్ళు తయారవ్వడానికి ఎక్కువ సమయం పట్టేదని, తనకు చాలా స్వల్ప సమయం పట్టేదని చిత్ర పేర్కొంది. ఇది ఓ రకంగా తనకు ప్లస్ పాయింట్ గా ఆమె చెప్పుకొచ్చింది. ఈ సీరియల్ అంటే తనకు చాలా ఇస్తామని ఓ ఇంటర్యూలో చెప్పింది. అక్కా చెల్లెల్లు, దటీజ్ మహాలక్ష్మి,మనసున మనసై ఇలా చాలా సీరియల్స్ లో చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర కు మొదట్లో తెలుగు సరిగ్గా వచ్చేది కాదట. బెంగళూరు నుంచి ఈ సీరియల్ కోసం హైదరాబాద్ వచ్చేది. మొదట్లో భయపడినప్పటికీ కొంతకాలానికే భయం పోయి ఇక్కడి వాతావరణానికి కనెక్ట్ అయ్యాయని అంటోంది. అష్టా చెమ్మా సీరియల్ లో యాక్టింగ్ గురించి అసలు ఫీలింగ్ లేకుండా యాక్ట్ చేసానని, సెట్ లో ఉన్నా ఇంట్లో ఉన్నట్టే ఫీలయ్యే దాన్నని చైత్ర చెప్పింది.