అలనాటి హీరోయిన్ కూతురు కూడా పెద్ద స్టార్ హీరోయిన్… ఎవరో…???
సినిమా ఇండస్ట్రీలో మగవాళ్లే కాదు ఆడవాళ్ళ వారసులు కూడా ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుతున్నారు. ఇక ఒకప్పటి స్టార్ హీరోయిన్ సరిత కూతురు కూడా హీరోయిన్ అయింది. అప్పటి ఆడియన్స్ ని ఉర్రుతలూగిన సరిత నటిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా తనదైన ముద్ర వేసింది. ఎందరో హీరోయిన్స్ కి తన డబ్బింగ్ ద్వారా గుర్తింపు తెచ్చిన ఈమె గుంటూరు జిల్లాలో పుట్టింది. కె బాలచందర్ దర్శకత్వం వహించిన మరోచరిత్రతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఈమె కి ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అందించింది.
ఇందులోని పాటలు ఇప్పటికీ మధురంగానే ఉంటాయి. ఆ సినిమాలోని భలే భలే మాగాడివోయ్ బంగారు నా సామీరోయ్ పాటలోని భలే భలే మగాడివోయ్ పేరుతొ నాని హీరోగా వచ్చిన సినిమా కూడా హిట్ కొట్టింది. తెలుగు తమిళ ఇలా దక్షిణాది భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సరిత తమిళంలో బాగా పాపులార్టీ తెచ్చుకుంది. అయితే ఆమె గొంతుకు తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. విజ్జీ రామచంద్రన్ అనే చెల్లి కూడా ఈమెకు ఉంది. విజ్జీ కూడా యాక్టరే.
అయితే ఈమె బుల్లితెర యాక్టర్. ఈమె కూడా తమిళంలో బాగా పాపులర్ అయింది. అయితే విజ్జికి లవ్లీ చంద్రశేఖర్ అనే కూతురు ఉంది. పేరు ఎంతగా ఇంగ్లీష్ లో స్టైలిష్ గా ఉందో ఈమెకూడా స్టైలిష్ గానే ఉంటుంది. పెద్దమ్మ,తల్లి తరహాలో పాపులర్ గా నటి అవ్వాలని ట్రై చేస్తోంది. అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ పొందిన లవ్లీ పాపులర్ నటిగా పేరు తెచ్చుకోవాలని తపిస్తోంది. మరి ఈమె ఎలాంటి సెన్షేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.