Politics

పవన్ ఓటమికి కారణం తెలిసిందట….ఏమిటో…???

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీచేసి చిత్తుగా ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ . ఒకటి కాదు ఏకంగా రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసాడు పవన్ కానీ రెండు స్థానాల్లో కూడా దారుణంగా ఓడిపోయాడు అయితే దానికి కారణం ఏంటో ఇప్పుడు చెబుతున్నాడు జనసేన అధినేత . భీమవరం , గాజువాక అసెంబ్లీ స్థానాల్లో సరిగ్గా ప్రచారం చేయలేకపోయాను అందుకే ఓడిపోయాను అయినా ఓటమి చెందాం కదా అని వెనకడుగు వేసేది లేదని అంటున్నాడు పవన్ కళ్యాణ్ .

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయ్యాక తొలిసారిగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఏపీలో జరిగింది . ఆ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పోరాట పంథా వీడేది లేదని ప్రకటించాడు . అలాగే రాజకీయ వ్యవహారాల కమిటీ ని పునర్వ్యవస్తీకరిస్తామని అంటున్నాడు . జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టిన పవన్ ఏపీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయాడు . దాంతో మళ్ళీ సినిమాల్లోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఇంతవరకు అటువంటి చర్చలు అయితే ఏమి జరగడం లేదు .