Movies

ఎంట్రీకి సిద్ధం అయినా ఈ హీరోని గుర్తు పట్టారా….???

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వరుస సినిమాలు వస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా 17 ఏళ్ళ క్రితం వచ్చిన ఇంద్ర మూవీని ఎవరూ మర్చిపోలేరు. అప్పటిదాకా ఉన్న రికార్డులను ఒంటిచేత్తో దులిపేసిన ఈ బ్లాక్ బస్టర్ ని ఫ్యాన్స్ చాలా ప్రత్యేకంగా ఫీలవుతారు. అందులో మొదటి పావు గంట వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ తేజ తన నటనతో అదరగొట్టేసాడు. సీమలో మగాడు లేడా అని తెలంగాణ శకుంతల అడిగినప్పుడు నేనున్నాను నాయనమ్మ అంటూ తేజ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కి హాళ్లు విజిల్స్ తో దద్దరిల్లిపోయాయి. అందుకే ఇప్పటికీ అతడు పండించిన సీన్లు ఫాన్స్ మదిలో మెదులుతూనే ఉంటాయి. 

నిజానికి అంతకు ముందే చూడాలని ఉంది లాంటి సినిమాల ద్వారా పాపులర్ అయిన తేజ ఇప్పుడు పెద్దోడయ్యాడు. ఇక హీరోగా రూపాంతరం చెందేందుకు కావాల్సిన ఫిజిక్ ని ట్రైనింగ్ ని తీసుకుని డెబ్యూ చేస్తున్నాడు. హీరోగా ఓ మూవీ ఇప్పటికే షూటింగ్ లో ఉంది. అయితే వచ్చే నెల 5న విడుదల కానున్న స్టార్ హీరోయిన్ సమంతా నటించిన ఓ బేబీలో లక్ష్మి గారికి మనవడిగా కనిపించబోతున్నాడు. హీరో కన్నా ముందే కీలకమైన పాత్ర ద్వారా తేజ ఎంట్రీ ఇస్తున్నాడు.

వాస్తవానికి ఈ రెండూ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న మూవీస్ కావడం యాదృచ్ఛికం. ఇదే సంస్థలో తేజ చిన్నప్పుడు వెంకటేష్ కలిసుందాం రాలో చేసిన అల్లరి మాములుది కాదు. ఇన్నేళ్ల తర్వాత అదే సంస్థలో ఇలా తెరంగేట్రం చేస్తుండడం కూడా ఓ విశేషమే. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిసులుగా విపరీతమైన పేరు తెచ్చుకున్న వాళ్ళు పెద్దయ్యాక రాణించిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే ఆలీ-రాశి ఇలా వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. చాలామంది పెద్దయ్యాక హీరోగా సక్సెస్ కాలేక క్యారెక్టర్  ఆర్టిస్టులుగా మిగిలిపోయారు. అయితే తేజ తనదైన మార్కుతో హీరోగా, ఆర్టిస్ట్ గా ఎలా నిలదొక్కుకుంటాడో  చూడాలి. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ ఓ బేబీ మీద టీజర్ వచ్చాక మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక హీరోగా చేసే సినిమా పై కూడా అంచనాలు బాగానే ఏర్పడతాయి.