కళ్యాణ్ రామ్ అమ్మగారిని ఎన్టీఆర్ ఏమని పిలుస్తారో తెలుసా?
స్వర్గీయ నందమూరి హరికృష్ణ కు కళ్యాణ్ రామ్,జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కొడుకులే. ఇద్దరూ ఆయనకు రెండు కళ్లుగా చెప్పేవారు. కానీ ఇద్దరికీ తల్లులు మాత్రం వేరు. మొదట్లో వీరిద్దరి నడుమ మాటలు లేకున్నా , కారణం ఏదైనా ఇప్పుడు ఒక తల్లి బిడ్డల్లా ఉంటున్నారు. ఇద్దరూ ఎంతో ఆత్మీయంగా ఉంటున్నారు.
అందుకే తమ్ముడిని హీరోగా పెట్టి కళ్యాణ్ రామ్ జై లవకుశ మూవీ తీసాడు. గతంలో హరికృష్ణ తీసుకున్న చొరవ కారణంగా ఇద్దరూ కల్సి మెలసి ఉంటూ కుటుంబానికి అండగా ఉంటున్నారు. అయితే ఇప్పటివరకూ కళ్యాణ్ రామ్ తల్లి గురించి తారక్ ఎక్కడా పలకరించినట్లు,ఎక్కడా చెప్పినట్లు కనిపించదు.
తాజాగా ఓ సినిమా ప్రమోషన్ లో కళ్యాణ్ రామ్ తల్లిని పెద్దమ్మ అని సంబోధిస్తూ భర్త మరణం తర్వాత ఆమె పడుతున్న బాధ నేపథ్యంలో తారక్ విచారం వ్యక్తంచేశాడు. తండ్రి మరణంతో తాను,కళ్యాణ్ రామ్ ఎంతో కుమిలి పోతున్నామని , అసలు ఆ ఘటననుంచి బయటకు రాలేకపోతున్నామని తారక్ అన్నాడు. తమ తల్లుల బాధ తమకంటే ఎక్కువని అన్నాడు. తన తండ్రి లాగే తాను సంపూర్ణ జీవితాన్ని పొంది,తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని భావిస్తున్నట్లు తారక్ చెప్పాడు.