డిప్యూటీ CM పుష్ప శ్రీ వాణి ఎవరి కూతురో తెలుసా?
జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే పుష్ప శ్రీ వాణి సొంతూరు బుట్టయ్యగూడెం మండలం దొరమామిడి గ్రామం. వరుసగా రెండోసారి వైకాపా తరపున విజయాన్ని నమోదుచేసుకున్న ఈమె ఏకంగా మంత్రివర్గంలో చోటు సాధించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. పోలవరం నియాజకవర్గం లో పుట్టి పెరిగిన మహిళకు మంత్రి పదవి వరించడంతో స్థానికుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం విజయనగరం రాజుల కోటలో గెలిచినప్పటికీ ఆమె తమ బిడ్డేనని పోలవరం వాసులు మురిసిపోతున్నారు. పెల్లెయ్యవరకూ ఇక్కడే పుట్టిపెరిగిన పుష్ప శ్రీ వాణి ఇప్పుడు మంత్రిగా ఎదగడం దొరమామిడి వాసులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ఇక్కడే గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలలో పదవతరగతి వరకూ చదువుకున్న ఈమె ఇంటర్ ,డిగ్రీ లను జంగారెడ్డి గూడెం సూర్య కళాశాలలో పూర్తిచేశారు.
పుష్ప శ్రీ వాణి తండ్రి గిరిజన ఆశ్రమ పాఠశాలలో వంటమనిషిగా చేరి,ఉపాధ్యాయుడిగా పదోన్నతి పొంది ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగిగా ఉంటున్నారు. తన ముగ్గురు ఆడపిల్లలను విజయనగరమే ఇచ్చారు. ఇందులో పుష్ప శ్రీ వాణి విజయనగర రాజుల కోటలో అడుగు పెట్టడానికి పెద్ద కారణమే ఉంది. పెద్ద కుమార్తెకు విజయనగరం అబ్బాయితో పెళ్లయింది. అక్క ఇంటికి వెళుతున్న పుష్ప శ్రీ వాణి శతృచర్ల కుటుంబీకులకు కనిపించింది. దీంతో వేతకపోయిన తీగ కాలికి తగినట్లయింది. వెంటనే అందరితో మాట్లాడి ఇరుకుటుంబాల అంగీకారంతో పెళ్లి జరిపించారు. ఈమె అక్కా చెల్లెళ్ళు గృహిణులు. తమ్ముడు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు.