Movies

సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ హీరో చందన్ కుమార్ రియల్ లైఫ్

సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ లో బాలరాజు గా కనిపిస్తున్న నటుడి అసలు పేరు చందన్ కుమార్ 1985సెప్టెంబర్ 11న మైసూరులో పుట్టాడు. నర్సరీ ప్రయిమరీ స్కూల్స్ అయ్యాక,పిఇఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో తన చదువు పూర్తిచేసాడు. 2007నుంచి 2010వరకూ బెంగళూరులోని జనరల్ మోటార్స్ కంపెనీలో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసాడు. 

ఆతర్వాత 2013- 14లో లక్ష్మి బర్మా అనే మెగా సీరియల్ లో నటించిన చరణ్, రాధా కళ్యాణం సీరియల్ లో కూడా చేసాడు. అగ్ని సాక్షి సీరియల్ లోని గౌరీ తో కల్సి సర్వమంగళ మాంగల్యం సీరియల్ లో చేసారు. ఐ లవ్ యు అలియా,ప్రేమ బెహరా,బెంగళూరు,పరిణయ,లైఫ్ ఇస్తానే,ముదిరత్న కురుక్షేత్ర,కట్టు అనే సినిమాల్లో కూడా చందన్ నటించాడు. 

ఇక ప్రేమ బెహరా సినిమా పోస్టర్ ని కన్నడ సూపర్ స్టార్ సుదీప్ లాంచ్ చేసాడు. ఈ మూవీలో చందన్ సరసన హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య నటించింది. కన్నడ హృత్రిక్ రోషన్ అని కూడా ఫాన్స్ అంటుంటారు. కన్నడ బిగ్ బాస్ లో కూడా చందన్ పాల్గొని రన్నర్ గా నిలిచాడు. డాన్సింగ్ స్టార్ సీజన్ వన్ షో లో కూడా కనిపించాడు. ఇతడికి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం,చందన్ శెట్టి,సోనో నిగమ్ ఫాన్స్ అంటే ఇష్టమట.