బెల్లంకొండ ఏ స్టార్ అయ్యాడో తెలిస్తే షాక్ అవుతారు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలు, వాటి ఫలితాలు ఎలా ఉన్నా – శాటిలైట్ రూపంలో తన సినిమాలకు మంచి గిరాకీ ఏర్పడింది. ఇప్పటి వరకూ బెల్లంకొండ నటించిన సినిమాలన్నీ మంచి రేట్లు దక్కించుకున్నవే. మరీ ముఖ్యంగా హిందీలో సాయి సినిమాలకు మంచి గిరాకీ. తాజాగా తన కొత్త సినిమా `రాక్షసుడు` శాటిలైట్ కూడా భారీ మొత్తానికి అమ్ముడైంది. హిందీ డబ్బింగ్ శాటిలైట్ రూపంలో 12.5 కోట్లు వచ్చాయి. తెలుగు శాటిలైట్ జెమినీ టీవీ రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే కేవలం శాటిలైట్ రూపంలో 18.5 కోట్లు వచ్చాయన్నమాట.
ఈ సినిమా బడ్జెట్ తో పోలిస్తే… ఇది అధికమొత్తమే. బెల్లంకొండ సినిమాలకు ఉన్న అడ్వాంటేజ్ ఇదే. సినిమా ఎలా ఉన్నా, థియేటరికల్ రైట్స్ రూపంలో డబ్బులు వచ్చినా. రాకపోయినా – శాటిలైట్ మార్కెట్‌లో మినిమం గ్యారెంటీ ఉంది. హిందీ డబ్బింగ్ రైట్స్ అయితే పెద్ద హీరోలతో పోటీ పడి మరీ… డబ్బులు వస్తున్నాయి. బెల్లంకొండని శాటిలైట్ స్టార్ అని పిలవడంలో తప్పులేదేమో..?!