కార్తీక దీపం సీరియల్ తులసి ఎవరు…. తన లైఫ్ గురించి ఈ విషయాలు తెలుసా?
చిన్నా పెద్దా క్యారెక్టర్ లతో సంబంధం లేకుండా బుల్లితెరపై వచ్చే సీరియల్స్ లో నటిస్తే పేరువస్తుంది. ఇక స్టార్ మాలో ప్రసారం అయ్యే కార్తీక దీపం సీరియల్ లో నటించే నటీనటులందరికీ కూడా ఈ సీరియల్ వలన చాలా గుర్తింపు వచ్చిందని చెప్పాలి. ఇందులో ముఖ్యంగా తులసి పాత్రలో నటించిన అమ్మాయి వివరాల్లోకి వెళ్తే,ఈ పాత్రకు తగ్గట్టు ఈమె ఈ సీరియల్ లో నెమ్మదిగా, సంప్రదాయంగా కనిపిస్తోంది. పాజిటివ్ క్యారెక్టర్ ద్వారా అందరి అభిమానం పొందింది.
తులసి అసలు పేరు సీతా మహాలక్ష్మి. చూడచక్కనైన రూపంతో అందరినీ ఆకట్టుకున్న ఈమె మనసు మమత,కార్తీక దీపం వంటి సీరియల్స్ లో మంచి పాత్రలలో నటించింది. కార్తీక దీపం సీరియల్ లో నటించడం తన అదృష్టమని చెప్పే ఈమె, ఈ క్యారెక్టర్ పరంగా మొదట్లో దీపకు అండగా నిలబడుతుంది. దీపను కష్టాల నుంచి కాపాడిందని చెప్పాలి. అయితే కొన్ని రోజులు ఈ సీరియల్ లో కనిపించలేదు.
ఇక ఈ మధ్య కాలంలో విహారి భార్యగా కార్తీక దీపంలో రీ ఎంట్రీ ఇచ్చింది. దీపకు కవలలు పుట్టారన్న సంగతి తులసికి తెల్సిందే. అయితే తులసి ద్వారానైనా దీపకు హిమ తన కూతురేనన్న నిజం తెలిస్తే బాగుండునని ఆడియన్స్ అభిప్రాయం. ఓ తమిళ సీరియల్ లో కూడా ఈమె నటించబోతోందట. అంతేకాదు కలియుగం,లవ్ బాయ్ వంటి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. సెట్స్ మీద సహ నటీనటులతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంది. షూటింగ్ అయ్యాక టిక్ టాక్ లాంటి వీడియోలు చేస్తూ, ఎంజాయ్ చేస్తుంది.