Politics

ఎపి ప్రభుత్వ అంబాసిడర్ గా తారక్…. ఇందులో వాస్తవం ఎంత?

ప్రస్తుతం హిట్ మీద హిట్ కొడుతూ వరుస హ్యాట్రిక్ తో బిజీగా మారిపోయి,రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మూవీలో నటిస్తున్నాడు. బాహుబలి తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ఈమూవీ తారక్ తో పాటు రామ్ చరణ్ కల్సి మల్టీస్టారర్ గా రూపొందుతోంది. అయితే తాజాగా ఏపీలో కొత్త చర్చకు తెరలేచింది. 

ఎపి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందట. ఇందుకోసం సీఎం జగన్ ప్లాన్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. AP లోని మంత్రులకు కూడా జగన్ ఈవిషయం చెప్పారని వార్తలు వస్తున్నాయి. పరిశ్రమలు,వ్యవసాయం ,పర్యాటక తదితర రంగాలకు ఊతమిచ్చేలా ప్రచార కర్త లను పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇందులో భాగంగా ఒక రంగానికి జూనియర్ ఎన్టీఆర్ ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టాలని సీఎం కి పలువురు మంత్రులు కూడా సూచించారట. జగన్ కూడా సానుకూలంగా ఉన్నారట. అయితే జూనియర్ ని ఎలా సంప్రదించాలా అని తర్జన భర్జనలు పడుతున్నారట. అన్నీ కుదిరితే మరి తారక్ కూడా ఒకే అంటాడా లేదో చూడాలి.