Movies

సాహో లో ఆసక్తి రేపుతున్న క్యారెక్టర్ ఇదే… భయంకరంగా ఉంటుంది

బాహుబలి తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న మూవీ సాహో పై భారీ అంచనాలున్నాయి. భారీ బడ్జెట్ తో సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ టీజర్ కూడా ఇటీవల విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ మూవీలో చుంకీ పాండే పాత్ర అత్యంత భీకరంగా, భయంగా ఉంటుందట. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ సినిమాకోసం అందరిలాగానే తనుకూడా వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. 

ఓ ఇంగ్లిష్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్యూలో బాలీవుడ్ నటుడు చుంకీ పాండే మాట్లాడుతూ సెన్షేషనల్ కామెంట్స్ చేసాడు. సాహో మూవీలో తన పాత్ర గురించి ఎక్కువగా టీజర్ లో కనిపించలేదని,ఎక్కువ సేపు కనిపించలేదని అన్నాడు. అయితే ఈ మూవీ చాలా ఫెంటాస్టిక్ గా తెరకెక్కిందని చెప్పాడు. 
సినిమాలో గతంలో ఎన్నడూ లేనంత భయంకరంగా కనిపిస్తానని చుంకీ పాండే అంటున్నాడు.

ఇప్పటివరకూ హిందీలో వచ్చిన బేగం జాన్ లోని తన పాత్ర చాలా భయంకరంగా ఉందని అప్పట్లో చాలామంది అభిప్రాయ పడ్డారని గుర్తుచేశాడు. అయితే సాహోలో అంతకన్నా భయంకరంగా కనిపిస్తానని అన్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్ సూపర్ అని చెప్పాడు.