Movies

కళ్యాణీ ప్రియదర్శన్‌ అంత బిజీయా ? ట్రాక్ లో పడినట్టేనా….??

తొలి సినిమాకే నటిగా మంచి పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ కళ్యాణీ ప్రియదర్శన్‌ ‘హలో’తో ఎంట్రీ ఇచ్చింది. ఫిల్మీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్నప్పటికీ, గ్లామర్‌కి తక్కువ, పర్‌ఫామెన్స్‌ ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తూ మంచి మంచి పాత్రల ను ఎంచుకుంటోంది. అందుకే ఇటీవల తెలుగులో ‘చిత్రలహరి’ సినిమాతో సాయి ధరమ్‌కి మంచి హిట్‌ ఇచ్చింది. అలాగే ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న శర్వానంద్‌ మూవీ ‘రణరంగం’లో చేస్తోంది. 

అంతేకాకుండా కళ్యాణీ ప్రియదర్శన్‌ తమిళ సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇప్పటికే కోలీవుడ్‌ సెన్సేషనల్‌ యంగ్‌ హీరో శివకార్తికేయన్‌తో కలిసి ‘వాన్‌’ అనే సినిమాలో నటిస్తోంది. అదేవిధంగా మమ్ముట్టి తనయుడు దుల్కర్‌ సల్మాన్‌తో మరో సినిమాలో నటిస్తోంది. తాజాగా సీనియర్‌ హీరో శింబు సరసన హీరోయిన్‌గా ఎంపికైంది. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మానాడు’ సినిమాలో కళ్యాణీ హీరోయిన్‌గా ఒప్పుకుంది. 

ఆమె చబ్బీ చీక్స్‌ క్యూట్‌ అప్పీల్‌ ఇస్తూ, యంగ్‌ హీరోస్‌ పక్కనా హీరోయిన్‌గా సెట్‌ అవ్వడం కల్యాణీ ప్రత్యేకత. ఆమె బాడీ లాంగ్వేజ్‌లోని హుందాతనం సీనియర్‌ హీరో లతో కూడా జతకట్టేలా చేస్తోంది. అందుకే ఆమెకు శింబు సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ దక్కేలా చేసింది. ఈ సినిమాలో కళ్యాణీ పాత్ర చూస్తే, హీరోయిన్‌గా ఏదో ఓ మోస్తరు ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదట. చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర గా చెబుతున్నారు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయితే, తమిళ నాట స్టార్‌ హీరోయిన్‌ అయిపోవడం ఖాయం.