చెర్రీతో పవర్ స్టార్ సినిమా తీసేనా ? రాజకీయాల నుండి సినిమాలకు టర్న్ అవుతున్నాడా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్ళు మూవీకి నిర్మాతగా వ్యవహరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నాగబాబుకి నిర్మాణం వదిలేసి తను పూర్తిగా నటన వైపు దృష్టి పెట్టాడు. అయితే ఆమధ్య పవన్ స్వంత బ్యానర్ లో రామ్ చరణ్ సినిమా చేస్తాడనే వార్త బలంగా ప్రచారంలోకి వచ్చింది. నిజానికి పవన్ కు ఆ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. త్రివిక్రమ్ తో స్నేహం కుదిరాకే మళ్ళి ప్రొడక్షన్ వైపు వచ్చారు.జనసేన బలోపేతం చేయడం కోసం ఇకపై నటించనని పవన్ ఖరాఖండిగా చెబుతున్నా, మళ్ళీ ఎప్పుడో అప్పుడు చేయకపోడా అని అభిమానులైతే గంపెడాశతో ఉన్నారు.
ఇక ఎన్నికలు పూర్తవ్వడంతో ఇప్పుడు ఎలాగూ తీరిక సమయం ఉంది కాబట్టి చరణ్ తో ప్రాజెక్ట్ గురించి పవన్ సీరియస్ గా అలోచిస్తున్నట్టు టాక్. ఆర్ఆర్ఆర్ కు ఇంకో ఏడాది పడుతుంది. చెర్రి ఇంకా ఎవరికి పర్సనల్ గా కమిట్ కాలేదు. అందుచేత అన్నీ కుదిరితే పవన్ సొంత సినిమాలో చెర్రీ నటించబోయే సినిమా పట్టాలు ఎక్కే ఛాన్స్ లేకపోలేదు. బాబాయ్ అడగాలే కాని అబ్బాయ్ దర్శకుడు ఎవరు అని చూడకుండా మరీ ఓకే చేసేస్తాడు. అయితే పవన్ మాత్రం త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే ప్లాన్ చేస్తున్నాడట.
కాకపోతే ఇదంతా కొలిక్కి రావడానికి టైం పట్టేలా ఉంది.
అల్లు అర్జున్ మూవీ ఫినిష్ అయ్యాక త్రివిక్రమ్ ఎవరితో చేస్తారనేది క్లారిటీ లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కథ కుదిరితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉన్నాడు. మరోవైపు కొరటాల శివ సినిమా తర్వాత తనతో ఒకటి చేయమని చిరంజీవి స్వయంగా అడిగారు. దీంతో ఇక్కడ పెద్ద చిక్కుముళ్ళే ఉన్నాయి. ఒకవేళ లెక్కలు మారి వేరే డైరెక్టర్ లైన్ లోకి వచ్చినా పవన్ మాత్రం చరణ్ తో నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేయాలనే ఆలోచన గట్టిగా చేస్తున్నాడట. ఇది నిజంగా కార్యరూపం దాలుస్తుందా రూమర్ గానే మిగిలిపోతుందా అనేది చూడాలి.