Movies

కైరా అద్వానీ గురించి మీకు ఈ నమ్మలేని నిజాలు తెలుసా?

తెలుగులో హిట్ కొట్టిన ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్ రీమేక్ ‘కబీర్ సింగ్’ నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే దీనిపై కొంతమంది క్రిటిక్స్ విమర్శలు గుప్పించారు. కొంతమంది మెచ్చుకున్నారు. అయితే అభిప్రాయాలతో సంబంధం లేకుండా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. ఈ సినిమాలో షాహిద్, కైరా అద్వానీ హీరో,హీరోయిన్లుగా నటించారు. లవ్ ను సినిమాల్లో మరీ అతిగా గ్లామరైజ్ చేస్తారు కానీ ఒక సాధారణమైన మనిషి తన జీవితంలో మాస్ మహారాజా రవి తేజ ‘నా ఆటోగ్రాఫ్’ సినిమాలో లాగా కనీసం రెండు మూడు నాలుగు సార్లు లవ్ లో పడతారు. ఇక రసిక, కళాత్మక హృదయులైతే ఎన్ని సార్లు లవ్ లో పడుతూ, లేస్తారో లెక్కాపక్కా ఉండదు. ఆవిధంగా అదేం తప్పు కాదు అని కొందరు చెప్పేమాట. 

‘కబీర్ సింగ్’ కారణంగా ఇప్పుడు ఆ లవ్ టాపిక్ వచ్చింది. ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూలో కైరాను “మీ జీవితంలో లవ్ స్టొరీలు ఉన్నయా? ఎప్పుడైనా ప్రేమించిన వ్యక్తికి దూరమై బాధపడ్డారా?” అని ప్రశ్నించారు. దీనికి కైరా అద్వానీ ఓపెన్ గానే సమాధానం ఇస్తూ, తను పదవ తరగతి చదివే సమయంలో తనకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డానని చెప్పి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. అయితే ఒకరోజు అతనితో ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటే కైరా అద్వానీ అమ్మగారు కనిపెట్టేసారట. 

ఇలాంటి పనులన్నీ వదిలేసి, చదువుపై ఫోకస్ చెయ్యమని సున్నితంగా ఆతల్లి హెచ్చరించిందట! అంతేకాదు, ఇకపై అబ్బాయిలతో మాట్లాడకూడదని వార్నింగ్ ఇస్తూ అల్టిమేటం జారీ చేసిందట. ఆ అబ్బాయిది విభిన్న మనస్తత్వం కావడంతో విడిపోయామని చెప్పింది. ఆసమయంలో బెడ్ మీద నుంచి లేచి బయటకు రావడానికి కూడా ఇష్టపడేది కాదట. అది చాలా కష్టమైన విషయంలా అనిపించేదని, తర్వాత తన కెరీర్ పై దృష్టిపెట్టడంతో మామూలు మనిషి అయ్యానని చెప్పుకొచ్చింది. అప్పుడు విడిపోయిన వ్యక్తి ఇప్పుడు కూడా తనకు మంచి స్నేహితుడని ట్విస్ట్ ఇచ్చింది. ప్రస్తుతం తను సింగిల్ గానే ఉన్నానని కూడా పూర్తి క్లారిటీ ఇచ్చింది.