Movies

బిగ్ బాస్ – 3 పార్టిసిపెంట్స్ కి సినిమా రేంజ్ లో రెమ్యూనరేషన్… ఎవరికి ఎంతో తెలుసా?

బిగ్ బాస్ రియాల్టీ షో రెండు సీజన్స్ విజయవంతంగా సాగడంతో ఇక మూడవ సీజన్ ఎప్పుడా అని జనం ఎదురుచూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ వార్తలు వస్తున్నాయి గానీ ఇంకా క్లారిటీ లేదు. సీజన్ వన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అదరగొట్టగా, సీజన్ 2కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసి,పర్వాలేదనిపించాడు. ఇక సీజన్ త్రి కి సంబంధించి లాంచ్ ప్రోమో కూడా వచ్చేసింది. 

అయితే ప్రోమో చూసాక హోస్ట్ ఎవరనే క్వశ్చన్ వస్తుంది. కాకపొతే హోస్ట్ గా నాగార్జున అని ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వచ్చేసాయి కదా. ఇక పార్టిసిపెంట్స్ గురించి,వాళ్ళ రెమ్యునరేషన్స్ గురించి జోరుగా చర్చ నడుస్తోంది. సినిమా యాక్టర్స్ ని తలదన్నే రెమ్యునరేషన్స్ ఇస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఎందుకంటే పార్టిసిపెంట్స్ కూడా తమ రేంజ్ లో అదరగొట్టబోతున్నారు. 
ప్రముఖ యాంకర్స్ శ్రీముఖి,లాస్య కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

వీళ్లకు భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి తీసుకున్నట్లు చెబుతున్నారు. శ్రీముఖికి 50లక్షలు,లాస్యకు30లక్షలు సింగిల్ పేమెంట్ గా ఇస్తున్నట్లు తెలుస్తోంది. హౌస్ లోకి వెళ్లబోయే ముందే వీరికి ఈ మొత్తాన్ని ముట్టజెబుతారట. వీళ్ళు ఫైనల్ గా మిగిలితే ఫ్రీజ్ మనీ అదనంగా ఉంటుందట. . ఇంత  భారీ మొత్తం ఇస్తూ షో చేస్తున్నారంటే ఇది ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రముఖ యాంకర్ ఉదయ భాను,నటులు వరుణ్ సందేశ్,వేణు లాంటి వాళ్ళు ఉండబోతున్నారు.