జగన్ కారు డ్రైవర్ జీతం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?
సాధారణంగా ఇంట్లో ఉండే కారుకి డ్రైవర్ ని పెట్టుకుంటే మహా అయితే 10,12వేలు మించి ఇవ్వరు. అయినా అంతెందుకులే అనే మనస్తత్వంతో ఉంటారు చాలామంది. ఇక సినీ సెలబ్రిటీలు,రాజకీయ నేతలకు కారు డ్రైవర్స్ గా పనిచేసేవారికి మంచి జీతాలు దక్కొచ్చు లేదా మామూలుగానే ఉండొచ్చు. వారి వారి మనస్తత్వాన్ని, స్థోమతను బట్టి జీతం చెల్లిస్తారు.
ఇక సీఎం జగన్ కారు డ్రైవర్ కి జీతం అంటే లక్షకు పైమాటే. అది కూడా బేసిక్ సాలరీ అని చెప్పొచ్చు. రాష్ట్రాన్ని నడిపే జగన్ కి కారు డ్రైవర్ అంటే చాలా చేయి తిరిగిన వాడై ఉండాలి. మంచి ప్రవర్తన,క్రమశిక్షణ,చురుకుదనం గల డ్రైవర్ అయి ఉండాలి కదా. సాధారణంగా చాలామంది పదవులల్లోకి రాకముందు ఒకలాగా వచ్చాక ఒకలాగా ఉంటారు. పదవి వచ్చాక తమ దగ్గర పనిచేసినవాళ్లను మరిచిపోతారు. కానీ జగన్ అలా కాదు పాతవాళ్లను గుర్తుపెట్టుకుని వాళ్ళను అలానే కొనసాగిస్తూ జీతాలు పెంచారు.
కొత్తవాళ్లను నియమించుకునే బదులు పాత డ్రైవర్ ని ఉంచి జీతం తో పాటు జీవితాన్ని పెంచారు. అవును, జగన్ కి గతం నుంచి గల డ్రైవర్ నే ప్రభుత్వం తరపున ఇప్పుడు నియమించారట. ఎప్పటినుంచో అభిమానం కలిగి ఉండడం, నమ్మకస్తుడు కావడం వలన తన కారు డ్రైవర్ గా పెట్టుకున్నారట. నెలకు లక్ష జీతం తో పాటు అదనపు సౌకర్యాలు వర్తింప జేస్తున్నారట. అందుకే జగన్ ని చాలామంది మెచ్చుకుంటున్నారు.