మన స్టార్ హీరోల భార్యల తోబుట్టువులు ఏమి చేస్తున్నారో తెలుసా?
మన టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్, అల్లు అర్జున్ ల భార్యలు గురించి చాలామందికి తెల్సు. వాళ్ళు విద్యావంతులే కాకుండా వ్యాపారంలో కూడా ఆరితేరిన వారే. ఇక వారి కుటుంబ సభ్యులలో ముఖ్యంగా తోబుట్టువుల గురించి ఆలోచిస్తే,కొన్ని విషయాలు తెలుస్తాయి. రామ్ చరణ్ భార్య ఉపాసన ఎవరంటే అపోలో ఆసుపత్రి అధినేత ప్రతాప్ సి రెడ్డి మనవరాలు. శోభన కామినేని పెద్ద కుమార్తె ఉపాసన. ఈమెకు తమ్ముడు, చెల్లెలు కూడా ఉన్నారు. ఇద్దరూ విదేశాల్లో చదువుతున్నారు. చెల్లెలు అనిష్ప ల దాదాపుగా అక్కపోలికలతోనే ఉంటుంది.
ఎంబీఏ చేసి , ఇండియా వచ్చాక, అపోలో ఫార్మసీ వ్యవహారాలు చూసుకుంటోంది. అక్కచెల్లెలిద్దరూ మోడ్రన్ గానే ఉంటూ ఒకరికొకరు పోటీపడతారు. అయితే అనిష్ప ల ప్రేమలో ఉందని,పెళ్లి కూడా చేసుకోబోతోందని జోరుగా ప్రచారం కూడా సాగుంతోంది. అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఈ విషయంలో స్పందించడంలేదు. ఇక మెగా మేనల్లుడు అల్లు ఆరోజు స్టయిలిష్ స్టార్ గా రాణిస్తున్నాడు. ఇతడి భార్య స్నేహలతా రెడ్డి సెయింట్ కాలేజీ యజమాని కేసి శేఖర్ రెడ్డి కుమార్తె ఈమె. ఎన్ని ఆస్తులున్నా, ఎంత చదువుకున్నా ఒదిగే మనస్తత్వం ఈమెది. ఆమెకు నాగురెడ్డి అనే సోదరి ఉంది. స్నేహ ,నాగు ఇద్దరూ విదేశాల్లోనే చదివారు. ఇద్దరూ అందగత్తెలే.
తండ్రికి చెందిన విద్యా వ్యవహారాలు చూస్తూ కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుతోంది. ఇక చెల్లెలు కూడా ఫ్యాషన్ రంగంలో దూసుకెళ్తోంది, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 92లో టాప్ స్టిచ్ పేరుతొ వ్యాపారం నిర్వహిస్తోంది. దేశంలో ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన దుస్తులను ఒకచోటకు చేర్చి,ఫ్యాషన్ ప్రియులకు అందిస్తోంది. ఇక తారక్ భార్య లక్ష్మి ప్రణతి రియల్ ఎస్టేట్ వ్యాపారి,స్టూడియో ఎన్ అధినేత నార్ని శ్రీనివాసరావు కుమార్తె.
ఈమె మాజీ సీఎం చంద్రబాబు మేనకోడలుకి కూతురు. పక్కాగా కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ మీడియాకు దూరంగా ఉంటుంది. ఇక ఈమె తమ్ముడు నితిన్ చంద్ర హైదరాబాద్ బిజినెస్ స్కూల్లో చదువుతూ తండ్రి వ్యాపారాలను చూస్తున్నాడు. బావ ఎన్టీఆర్ సినిమా వస్తే చాలు ఫ్రెండ్స్ తో కల్సి థియేటర్ లో వాలిపోతాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యితడు సినిమాల్లో నటించాలని తహతహ లాడుతున్నాడు.